Nita Ambani : పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ కొన్న నితా అంబానీ.. 6 నెలల్లో రెండో లగ్జరీ కారు- ధర చూస్తే షాక్​!-nita ambani buys a personalised rolls royce phantom viii worth over 12 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nita Ambani : పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ కొన్న నితా అంబానీ.. 6 నెలల్లో రెండో లగ్జరీ కారు- ధర చూస్తే షాక్​!

Nita Ambani : పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ కొన్న నితా అంబానీ.. 6 నెలల్లో రెండో లగ్జరీ కారు- ధర చూస్తే షాక్​!

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 05:30 PM IST

Nita Ambani Rolls-Royce Phantom 8 : నీతా అంబానీ.. పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ ఫాంటమ్​ 8 లగ్జరీ కారు కొన్నారు. ఈ మోడల్​ ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ కొన్న నీతా అంబానీ
పర్సనలైజ్డ్​ రోల్స్​ రాయిస్​ కొన్న నీతా అంబానీ (Instagram - NMACC & Automobili Ardent)

Nita Ambani luxury cars : భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో ఒకటైన అంబానీలు.. వారి విలాసవంతమైన జీవనశైలి విషయంలోనూ వార్తల్లో ఉంటారు. వారి లైఫ్​స్టైల్​.. ధనికులకు కూడా ఒక బెంచ్​మార్క్​గా ఉంటుంది. ఇక ఇప్పుడు.. జియో గ్యారేజీగా ప్రసిద్ధి చెందిన అంబానీ కుటుంబంలోకి ఒక కొత్త కారు వచ్చి చేరింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పర్సనలైజ్డ్​ రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ను కొనుగోలు చేశారు. ప్రత్యేకమైన రోజ్ క్వార్ట్​జ్​ షేడ్​లో తయారైన ఈ ఫాంటమ్ 8 చాలా స్టైలిష్​గా ఉంది.

నీతా అంబానీకి చెందిన కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీ కారు.. ఇప్పుడు ఇంటర్నెట్​లోనూ హల్​చల్ చేస్తోంది. ఆర్కిడ్ వెల్వెట్​తో ఫినిష్ చేసిన ఇంటీరియర్​లో ఈ కారు కనిపిస్తోంది. హెడ్​రెస్ట్​లపై నీతా అంబానీ పేరులోని తొలి అక్షరాలు 'ఎన్ ఎంఏ' లేదా 'నీతా ముఖేష్ అంబానీ' ఎంబ్రాయిడరీ చేయగా.. 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' బంగారంతో ముస్తాబైంది. ఫాంటమ్​లోని డిన్నర్ ప్లేట్ చక్రాలు ఈ సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.

ఫాంటమ్ 8 నిజంగా దాని రంగుకు ప్రత్యేకమైనది. ఈ కలర్​.. వెహికిల్​కి మరింత రిచ్​ లుక్​ని ఇస్తుంది. ఇది నీతా అంబానీ పబ్లిక్ పర్సనాలిటీకి కూడా బాగా సరిపోతుంది. రోల్స్ రాయిస్ కొనుగోలు అనుభవంలో కస్టమైజేషన్లు ఒక బలమైన భాగం. ఇక కస్టమైజ్​ చేసుకుంటే ధర కూడా పెరుగుతుందనుకోండి. నీతా అంబానీ ఎన్ని కస్టమైజేషన్ ఆప్షన్లను ఎంచుకున్నారో స్పష్టంగా తెలియదు. కానీ చాలా మార్పులే ఉన్నట్టు కనిపిస్తోంది.

Nita Ambani Rolls Royce Phantom luxury car : రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీ లగ్జరీ కారులో 6.75-లీటర్ వీ12 ట్విన్-టర్బోచార్జ్​డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 571 బీహెచ్​పీ పవర్​ని 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. మోటారు ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈడబ్ల్యుబీ కేబిన్ అదనపు సౌకర్యం కోసం రెండవ వరుసలో తగినంత స్పేస్​ అందిస్తుంది.

Nita Ambani luxury cars collection list : నీతా అంబానీ కొత్త రోల్స్ రాయిస్ ధరపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే.. పర్సనలైజేషన్ ఆప్షన్లను బట్టి భారత్​లో ధరలు సగటున రూ.12 కోట్లు (ఆన్-రోడ్) ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది నీతా అంబానీ మొదటి రోల్స్ రాయిస్ కాదు! అంబానీ కుటుంబంలోనూ మొదటిది కాదు. గత ఏడాది దీపావళి సందర్భంగా.. భర్త ముఖేష్ అంబానీ నీతాకు బ్లాక్ రోల్స్ రాయిస్ కల్లినన్ కారును బహుమతిగా ఇచ్చారు. అంటే.. ఆరు నెలల్లో నీతా అంబానీ చేతికి రెండు రోల్స్​ రాయిస్​ కార్లు వచ్చినట్టు! ఈ కుటుంబంలో పాత కొత్త తరాలకు చెందిన ఫాంటమ్స్ కూడా ఉన్నాయి. కొత్త రోల్స్ రాయిస్ కార్లతో పాటు జియో గ్యారేజీలో.. కొత్త ఫెరారీ పురోసాంగ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, కొత్త తరం రేంజ్ రోవర్ ఎల్​డబ్ల్యూబీతో పాటు మరెన్నో ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం