How to change car battery : కారు బ్యాటరీని సులభంగా మార్చుకోండి ఇలా..
11 April 2023, 7:39 IST
- How to change car battery : మీ కారులో బ్యాటరీ పనిచేయడం లేదా? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తున్నారా? బ్యాటరీని మార్చడం రాకెట్ సైన్స్ కాదు! మీరు సొంతంగా ఆ పని చేయవచ్చు. డబ్బులు మిగుల్చుకోవచ్చు. మరి కారు బ్యాటరీని సొంతంగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
కారు బ్యాటరీని సొంతంగా మార్చుకోవడం ఎలా?
How to change car battery : కారులో బ్యాటరీ అన్నది చాలా ముఖ్యమైనది. లైటింగ్, ఇగ్నీషన్తో పాటు ఇతర ఎలక్ట్రికల్ పనులన్నీ ఈ బ్యాటరీపైనే నడుస్తాయి. ఓ వాహనంలో అత్యవసరమైన భాగాల్లో ఈ బ్యాటరీ ఒకటి. వెహికిల్ స్మూత్‌గా, ఇబ్బందులు లేకుండా నడవాలంటే.. ఈ బ్యాటరీ కండీషన్ కూడా బాగుండాలి. బ్యాటరీ హెల్త్ సరిగ్గా లేకపోతే.. ఇక ఇబ్బందులు మొదలవుతాయి. విసిగించి వదిలేస్తాయి. అందుకే.. కారు బ్యాటరీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. సమస్యను ముందుగానే గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే బ్యాటరీని మార్చుకోవాలి.
సాధారణంగా.. బ్యాటరీని మార్చుకోవాలంటే మనం మెకానిక్ దగ్గరికి వెళతాం. అయితే.. బ్యాటరీని మార్చడం అన్నది రాకెట్ సైన్సేమీ కాదు! కాస్త సమయం కేటాయిస్తే చాలు. మనంతట మనమే కారు బ్యాటరీని మార్చుకోవచ్చు. కాస్త డబ్బులు మిగుల్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. కారు బ్యాటరీని మార్చుకోవడం ఎలా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ముందుగా.. కారు బ్యాటరీని గుర్తించండి..
How to change car battery in Telugu : ముందుగా కారు ఇంజిన్‌ను ఆపేయండి. కీ స్లాట్ నుంచి కీ తీసేయండి. బ్యాటరీ ఎక్కడ ఉందని గుర్తించే ముందు లేదా బ్యాటరీని ముట్టుకునే ముందు.. ఇంజిన్ కూల్ అయ్యిందో లేదే చూడండి. చాలా కార్లలో.. బానెట్ కింద బ్యాటరీ ఉంటుంది. ప్లాస్టిక్/ మెటల్ ట్రేపై ఉంటుంది. అయితే.. కొన్ని కార్లకి మాత్రం వెనక ఉన్న ట్రంక్‌లో బ్యాటరీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
బ్యాటరీ టర్మినల్స్‌ను డిస్కనెక్ట్ చేయండి..
కేబుల్స్ కనెక్ట్ చేసేందుకు బ్యాటరీలకు రెండు టర్మినల్స్ ఉంటాయి. అవి ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టి ఉండొచ్చు. వీటిల్లో ఒక బ్లాంక్, ఒక నెగిటివ్, ఒక రెడ్, ఒక పాజిటివ్ టర్మినల్స్ ఉంటాయి. లేదా పాజిటివ్, నెగిటివ్ అన్న సింబల్స్ ఉండొచ్చు. ముందుగా.. నెగిటివ్ కేబుల్‌ని డిస్కనెక్ట్ చేయండి. ఐ ప్రొటెక్షన్, చేతికి గ్లోవ్స్ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ టర్మినల్‌కు ఉన్న నెగిటివ్ కనెక్టర్‌ను టైట్ చేసే బోల్ట్‌ను లూజ్ చేసేందుకు వ్రెంచ్ని వాడండి. లూజ్ అయిన తర్వాత కేబుల్ కనెక్టర్‌ను ట్విస్ట్ చేస్తూ.. బ్యాటరీ టర్మినల్ నుంచి తీసేయండి. ఇదే విధంగా పాజిటివ్ కేబుల్‌ను కూడా తొలగించండి.
పాత బ్యాటరీని తొలగించండి..
How to change car battery athome : కారు బ్యాటరీల సెక్యూరిటీ కోసం వాటి పైన మెటల్ బార్స్ ఉంటాయి. లేదా వాటి కింద క్లాంప్స్ ఉంటాయి. వాటికి బోల్ట్స్ ఉంటాయి. వాటిని లూజ్ చేసి.. బ్యాటరీని పైకి తీయాల్సి ఉంటుంది. సాధారణంగా కారు బ్యాటరీల్లో కాస్టిక్ లిక్విడ్ ఉంటుంది. అందువల్ల.. బ్యాటరీని సరిగ్గా లిఫ్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి.
బ్యాటరీ ట్రేని క్లీన్ చేయండి..
బ్యాటరీ టర్మినల్ కనెక్టర్స్ తుప్పు పడుతుంటాయి. ఇది సాధారణమైన విషయమే. అందువల్ల బ్యాటరీని తొలగించిన తర్వాత.. వాటిని క్లీన్ చేయాలి. బ్యాటరీ క్లీనర్, వైర్ బ్రష్‌ను వినియోగించండి. బ్యాటరీ ట్రేని కూడా కడగండి. ఇందుకోసం బేకింగ్ సోడో పేస్ట్‌ను ఉపయోగించొచ్చు. అయితే.. క్లీనింగ్ తర్వాత మొత్తం డ్రై అయిపోవాలని గుర్తుపెట్టుకోండి.
కొత్త బ్యాటరీని ఇన్స్టాల్ చేయండి..
Car battery change process : కొత్త బ్యాటరీని ఇన్స్టాల్ చేసే సమయం వచ్చింది. అయితే.. రెడ్, బ్లాక్ టర్మినల్స్ సరిగ్గా ఉన్నాయా, లేవా చూసుకోవాలి. స్లాట్‌లోకి బ్యాటరీ పెట్టండి. మెటల్ బార్ లేదా క్లాంప్‌లో పెట్టి బోల్ట్‌ను టైట్ చయండి. అవసరమైతే రెండు టర్మినల్స్పై యాంటి కొరోసివ్ ప్రొటెక్షన్ జెల్ ఉపయోగించొచ్చు. ముందుగా.. పాజిటివ్ కేబుల్‌ను బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. టర్మినల్ లోపలికి పుష్ చేసి బోల్ట్ టైట్ చేయాలి. ఆ తర్వాత ఇదే విధంగా నెగిటివ్ కేబుల్‌ను కూడా పెట్టాలి. ఆ తర్వాత బ్యాటరీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని చెక్ చేయండి. ఇందుకోసం వెహికిల్ స్టార్ట్ చేయాలి.