తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla Layoffs : ఒకేసారి 14వేల మందిని తొలగించనున్న టెస్లా..

Tesla layoffs : ఒకేసారి 14వేల మందిని తొలగించనున్న టెస్లా..

Sharath Chitturi HT Telugu

17 April 2024, 9:30 IST

google News
  • Tesla layoffs 2024 : టెస్లాలో 14వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. సంస్థ వృద్ధి కోసం తప్పడం లేదని ఎలాన్​ మస్క్​ చెబుతున్నారు.

టెస్లాలో 14వేల మంది ఉద్యోగులు తొలగింపు..!
టెస్లాలో 14వేల మంది ఉద్యోగులు తొలగింపు..! (Reuters)

టెస్లాలో 14వేల మంది ఉద్యోగులు తొలగింపు..!

Tesla layoffs today : ప్రపంచవ్యాప్తంగా 'లేఆఫ్​' ప్రక్రియ మళ్లీ ఊపందుకుంటున్న వేళ.. టెస్లా నుంచి ఒక ఆందోళనకరమైన వార్త బయటకు వచ్చింది. భారీగా ఉద్యోగులను తొలగించేందుకు దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా సిద్ధపడింది. సంస్థలోని కనీసం 10శాతం, అంటే 14వేల మంది ఉద్యోగాలను టెస్లా తొలగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సంస్థ ఉద్యోగులకు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ఇప్పటికే ఈ-మెయిల్స్​ చేశారట.

టెస్లా లేఆఫ్​ 2024..

ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో కనీసం 14వేల మందిని తొలగించేందుకు ఎలాన్​ మస్క్​ సిద్ధపడ్డారు. 'రోల్స్​ డూప్లికేషన్​' ఇందుకు కారణం అని వివరించారు.

"కంపెనీ.. మరో దశ వృద్ధికి రెడీ అవుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రొడక్టివిటీని పెంచేందుకు.. అన్ని అంశాలను పరిగణించడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా.. సంస్థను రివ్యూ చేసి.. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగిస్తున్నాము. ఉద్యోగుల తొలగింపునకు మించి నేను ద్వేషించే విషయం మరొకటి ఉండదు. కానీ తప్పడం లేదు," అని ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్స్​లో ఎలాన్​ మస్క్​ చెప్పినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.

Tesla layoffs latest news : "ఇన్నేళ్ల పాటు టెస్లాకు పని చేసిన వారందరికి ధన్యవాదాలు. మా మిషన్​లో మీ పాత్రకు నేను కృతజ్ఞుడిని మీ భవిష్యత్తు అవకాశాలు బాగుండాలని విష్​ చేస్తున్నాను. గుడ్​ బై చెప్పడం చాలా కష్టం," అని మస్క్​ చెప్పారట.

గత కొన్ని నెలలుగా టెస్లాకు గడ్డు కాలం నడుస్తోంది. చైనా ఈవీ సంస్థల నుంచి టెస్లాకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఫలితంగా.. సంస్థ డెలివరీలు, సేల్స్​ తగ్గుతున్నాయి. తమ పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా ప్రైజ్​ కట్​ తీసుకున్నా.. పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

ఇండియాలోకి టెస్లా..

Telsa in India : టెస్లా సంస్థ ఇండియాలోకి ప్రవేశించేందుకు అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇండియాలోని అనేక రాష్ట్రాలు.. టెస్లాను ఆకట్టుకునేందుకు కృషిచేస్తున్నాయి. ఎలాన్​ మస్క్​.. ఈ నెలలో ఇండియాకు వస్తారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని సమాచారం. ఈ మీటింగ్​కి సంబంధించిన డేట్​ ఇంకా ఫిక్స్​ అవ్వలేదు కానీ.. ఈ ట్రిప్​లోనే ఇండియాలో టెస్లా లాంచ్​పై ఓ కీలక ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం