BJP manifesto 2024 : యువత, రైతులు, మహిళలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా.. 2024 లోక్సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆదివారం జరిగిన కార్యక్రమంలో.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసి.. పలు కీలక వ్యాఖ్యాలు చేశారు మోదీ. ఈ నేపథ్యంలో.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ‘మోదీ కీ గ్యారంటీ’లు, హామీలను ఇక్కడ తెలుసుకోండి..
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ను బలోపేతం చేసి, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 సామర్థ్యాలను పెంచుతాము.
ముద్రా రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేయడం, పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ యోజన వంటి ఇతర పథకాలను విస్తరించడం వంటి చర్యల ద్వారా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలతో సహా అన్ని కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను విస్తరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
ట్రాన్స్జెండర్ల అవసరాలను తీర్చడానికి 'గరిమా గ్రాహాస్' నెట్వర్క్ని విస్తరిస్తామని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ప్రధాని మోదీ.. బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్లందరిని ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.
సంబంధిత కథనం