Tesla in Telangana : తెలంగాణలో టెస్లా ప్లాంట్! ఎలాన్ మస్క్ టీమ్‌తో ప్రభుత్వం చర్చలు..
Tesla India : ఎలాన్ మస్క్‌కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో చర్చలు జరుపుతున్నట్టు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో టెస్ల ప్లాంట్ ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నట్టు వివరించారు.
Tesla in India : ఇండియాలోకి ఎలాన్ మస్క్ టెస్లా రాక అనివార్యం! ఎలక్ట్రిక్ వాహనాల మేన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసేందుకు అణువైన ప్రదేశాల కోసం టెస్లా టీమ్ అన్వేషణ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు కోసం ఎలాన్ మస్క్ టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.
ఎలాన్ మస్క్ టెస్లా టీమ్‌తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..
"అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 2023 నుంచి ఈ విషయంపై ఫోకస్ చేశాము. ఇందులో భాగంగానే.. ఇండియాలో టెస్లా పెట్టుబడులను కూడా ట్రాక్ చేస్తున్నాము. టెస్లాను తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా తీవ్రంగా కృషి చేస్తున్నాము. టెస్లాతో మా టీమ్ చర్చలు జరుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా.. తెలంగాణకు టెస్లా వచ్చే విధంగా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాము," అని ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు శ్రీధర్ బాబు.
"తెలంగాణలో పరిశ్రమలకు ఫ్రెండ్లీ పాలసీ ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూపొందించి ప్రొగ్రెసివ్, ఫ్యూచరిస్టిక్ విజన్ కోసం కృషి చేస్తున్నాము. టెస్లా వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పని చేసేందుకు అనుగుణంగా పర్మిషన్ వ్యవస్థ ఉంది," అని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Tesla Telangana government : ఎలక్ట్రిక్ కారు ప్లాంట్ ఏర్పాటు కోసం టెస్లా టీమ్ ప్రయత్నాలు చేస్తోందన్న రిపోర్టులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఓ ట్వీట్‌కు బదులుగా.. పైన చెప్పిన వివరాలను వెల్లడించారు శ్రీధర్ బాబు.
"టెస్లాని తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుతున్నాను. టెస్లా టీమ్ హైదరాబాద్‌లోకి వచ్చి, ఇక్కడి ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ పాలసీలను చూసే విధంగా చేయండి," అని ట్వీట్ చేశారు కేటీఆర్.
అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఇండియాలో 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోందట!
రేసులో ఇతర రాష్ట్రాలు..
Telangana government talks with Tesla : ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగానే పెద్ద విషయం. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టెస్లా ఎక్కడ ప్లాంట్‌ని పెడితే.. అక్కడ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే.. చాలా రాష్ట్రాలు టెస్లాను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ రేసులో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉన్నట్టు సమాచారం.
మరి ఈ రాష్ట్రాల్లో ఎలాన్ మస్క్ టెస్లా టీమ్ దేనిని ఎంచుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈవీ సెగ్మెంట్‌కి ఇండియాలో ఇప్పటికే సూపర్ డిమాండ్ ఉంది. ఇక టెస్లా ఇండియాలోకి వస్తే.. ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందు తగ్గట్టుగానే కేంద్రం తన పాలసీలను మార్చుకుంటూ వస్తుండటం కూడా ఒక పాజిటివ్ పాయింట్. అంతేకాదు.. టెస్లా ఎంట్రీతో ఈ సెగ్మెంట్లో ఇప్పటికే బీభత్సంగా ఉన్న పోటీ.. మరింత పెరుగుతుంది.
సంబంధిత కథనం