Elon Musk: ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ కాదు.. ఇప్పుడు ఆ సింహాసనంపై ఉన్నది ఎవరంటే..?-elon musk is no longer the worlds richest person dethroned by ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk: ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ కాదు.. ఇప్పుడు ఆ సింహాసనంపై ఉన్నది ఎవరంటే..?

Elon Musk: ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ కాదు.. ఇప్పుడు ఆ సింహాసనంపై ఉన్నది ఎవరంటే..?

HT Telugu Desk HT Telugu

Elon Musk: దాదాపు గత 9 నెలలుగా ప్రపంచంలో అత్యంత సంపన్నుడి హోదాలో కొనసాగుతున్న ఎలన్ మస్క్.. తాజాగా, ఆ హోదాను కోల్పోయారు. ఇప్పుడు ఆ సింహాసనం మీదకు అమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ (Jeff bezos) చేరారు.

ఎలన్ మస్క్ (Reuters)

world richest person: గత తొమ్మిది నెలలుగా ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ఎక్స్( గతంలో ట్విటర్) సీఈఓ ఎలన్ మస్క్.. లేటెస్ట్ గా ఆ హోదా కోల్పోయారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఇప్పుడు ఆమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ (Jeff bezos) నిలిచారు. ఎలన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు.

టెస్లా పతనం

టెస్లా షేర్లు 7.2 శాతం పడిపోవడంతో ఎలన్ మస్క్ (Elon Musk) తన నికర విలువలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోయారు. దాంతో, ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. ఆ స్థానంలోకి జెఫ్ బెజోస్ చేరుకున్నారు. ఎలన్ మస్క్ (Elon Musk) సంపద ప్రస్తుతం 197.7 బిలియన్ డాలర్లుగా ఉంది. జెఫ్ బెజోస్ (Jeff bezos) సంపద 200.3 బిలియన్ డాలర్లుగా ఉంది.

2021 తరువాత మొదటిసారి..

2021 తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. టెస్లా షేర్లు పతనమవుతుండగా, అమెజాన్ (Amazon) షేర్లు పై పైకి వెళ్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎలన్ మస్క్, బెజోస్ మధ్య సంపద అంతరం తగ్గుతోంది. ఒకానొక దశలో ఎలన్ మస్క్ (Elon Musk), జెఫ్ బెజోస్ (Jeff bezos) మధ్య నికర విలువ వ్యత్యాసం 142 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రెండు కంపెనీలు యుఎస్ లోని మాగ్నిఫిషియల్ సెవెన్ స్టాక్స్ లో భాగంగా ఉన్నాయి. అయితే అమెజాన్ స్టాక్ విలువ 2022 నుండి రెట్టింపు కాగా, టెస్లా షేర్ విలువ 2021 గరిష్ట స్థాయి నుండి దాదాపు 50 శాతం పడిపోయింది. షాంఘైలోని తమ ప్లాంట్ నుంచి ఎగుమతులు ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయని ప్రాథమిక గణాంకాలు వెల్లడించడంతో టెస్లా షేర్లు సోమవారం మరోసారి పతనమయ్యాయి. మరోవైపు కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి అమెజాన్ తన అత్యుత్తమ ఆన్ లైన్ అమ్మకాల వృద్ధిని సాధిస్తోంది.

ఎలన్ మస్క్ నికర విలువ మరింత దెబ్బతినే అవకాశం

టెస్లా (tesla) షేర్లు భారీగా పతనమవడం వల్లనే కాకుండా ఎలన్ మస్క్ నికర విలువ మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. టెస్లాలో ఎలన్ మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని తీసుకోవడాన్ని డెలావేర్ జడ్జి కొట్టివేశారు. ఈ తీర్పుతో మస్క్ సంపద మరింత క్షీణించవచ్చు. మస్క్ పే ప్యాకేజీని సవాలు చేసిన ఓ ఇన్వెస్టర్ పక్షాన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, అమెజాన్లో తనకున్న 9 శాతం వాటాతోనే బెజోస్ సంపదలో అధిక భాగం సమకూరుతోంది. గత నెలలో సుమారు 8.5 బిలియన్ డాలర్ల విలువైన 50 మిలియన్ షేర్లను అన్ లోడ్ చేసిన తర్వాత కూడా అతను ఆమెజాన్ లో అతిపెద్ద వాటాదారు. 2017లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపదను అధిగమించిన జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2021లో అమెజాన్ (Amazon) షేర్లు ఎగిసిపడగా, టెస్లా షేర్లు క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి.