తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tecno Camon 30 Series : టెక్నో కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​.. లాంచ్​కి రెడీ- ఫీచర్స్​ వివే!

Tecno Camon 30 series : టెక్నో కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​.. లాంచ్​కి రెడీ- ఫీచర్స్​ వివే!

Sharath Chitturi HT Telugu

11 May 2024, 7:20 IST

google News
  • Tecno Camon 30 pro : టెక్నో కామన్​ 30 సిరీస్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది. ఈ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​, వాటి ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెక్నో కామన్​ 30 సిరీస్​ వచ్చేస్తోంది..!
టెక్నో కామన్​ 30 సిరీస్​ వచ్చేస్తోంది..! (@TECNOMobileNG)

టెక్నో కామన్​ 30 సిరీస్​ వచ్చేస్తోంది..!

Tecno Camon 30 premier : ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ టెక్నో నుంచి సరికొత్త సిరీస్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు టెక్నో కామన్ 30​. ఈ టెక్నో కామన్ 30 సిరీస్​.. భారతదేశంలో త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ సిరీస్​లో.. టెక్నో కామన్ 30, టెక్నో కామన్ 30 5జీ, టెక్నో కామన్ 30 ప్రో 5జీ, టెక్నో కామోన్ 30 ప్రీమియర్ 5జీ వేరియంట్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యుసి) 2024 లో మొదట ఆవిష్కరించిన బేస్, ప్రో మోడళ్లు.. కొన్ని రోజుల క్రితం నైజీరియాలో లాంచ్​ అయ్యాయి.

టెక్నో కామన్ 30 సిరీస్ లాంచ్..

టెక్నో మొబైల్ ఇండియా.. ట్విట్టర్​లో చేసిన పోస్ట్ ద్వారా టెక్నో కామన్ 30 సిరీస్ లాంచ్​ అఫీషియల్​ అయ్యింది. అయితే లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. రాబోయే ఫోన్లలో సోనీ లిటియా కెమెరాల ఇంటిగ్రేషన్​ ఉంటుందని ప్రకటించింది సంస్థ. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. అదనంగా.. మరొక టీజర్​లో ఒక మోడల్ కోసం బ్లాక్ వీగన్​ లెథర్ ఆప్షన్ లభ్యతను సూచిస్తుంది.

టెక్నో కామన్ 30 సిరీస్ డిజైన్, ఫీచర్లు..

Tecno Camon 30 pro price : ఇప్పటివరకు విడుదలైన టీజర్స్​ని చూస్తే.. ఈ టెక్నో కామన్​ 30 సిరీస్​పై కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ఉన్న డిజైనే.. ఇండియన్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోనూ కంటిన్యూ చేస్తోంది టెక్నో. 

పలు లీక్స్​ ప్రకారం.. టెక్నో కామన్ 30 4జీలో మీడియాటెక్ హీలియో జీ99 చిప్​సెట్, 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్​ఓసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కామన్ 30 ప్రో 5జీ, కామన్ 30 ప్రీమియర్ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్లు ఉంటాయి. అన్ని మోడళ్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్​కు ఇవి సపోర్ట్​ చేస్తాయి.

టెక్నో కామోన్ 30 4జీ, 5జీ వెర్షన్లలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్​తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, డ్యూయెల్ రియర్ ఫ్లాష్ యూనిట్లు కలిపి కెమెరా సెటప్​గా ఉన్నాయి. కామన్ 30 ప్రో 5జీలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 1/1.56 ఇంచ్​ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్​తో 50 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

Tecno Camon 30 series launch : ఫ్లాగ్​షిప్​ టెక్నో కామన్ 30 ప్రో 5జీలో ఓఐఎస్​తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో సెకండరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్, క్వాడ్ ఫ్లాష్ యూనిట్​తో కూడిన అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్​తో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. అన్ని మోడళ్లలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉండటం విశేషం.

ఇక ఈ గ్యాడ్జెట్స్​కి సంబంధించి ప్రస్తుతం రూమర్స్​ మాత్రమే ఉన్నాయి. లాంచ్​ డేట్​తో పాటు ఫీచర్స్​పై క్లారిటీ రావాల్సి ఉంది. లాంచ్​ సమయంలో ఈ స్మార్ట్​ఫోన్స్​కు చెందిన ఫీచర్స్​, ధర వివరాలపై స్పష్టత వస్తుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తదుపరి వ్యాసం