work desk gadgets: వర్క్ డెస్క్ ఆర్గనైజ్డ్ గా కనిపించడానికి ఈ గ్యాడ్జెట్స్ తప్పనిసరి
Work desk gadgets: మీ వర్క్ స్పేస్ ను ఆర్గనైజ్డ్ గా చేసుకోవడానికి రూపొందించిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ లతో మీ ఆఫీస్ సెటప్ ను అప్ గ్రేడ్ చేసుకోండి. అమెజాన్ లో రూ.999 లోపు లభించే 5 గ్యాడ్జెట్లు మీ వర్క్ డెస్క్ ను మరింత ప్రొడక్టివ్ గా చేస్తాయి.
(1 / 5)
వీకూల్ టీ2 ఫోల్డబుల్ మొబైల్ స్టాండ్: దృఢమైన అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్, అడ్జస్టబుల్ వ్యూయింగ్ యాంగిల్స్, యాంటీ స్లిప్ ప్యాడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిపై మొబైల్ లేదా ట్యాబ్ ను అమర్చుకోవచ్చు. స్టెబిలిటీ, పోర్టబిలిటీని అందించే ఈ స్మార్ట్ ఫోన్ స్టాండ్ ధర రూ.399.(Amazon)
(2 / 5)
పోర్ట్రానిక్స్ మై బడ్డీ జి ల్యాప్ టాప్ డెస్క్: 7 విధాలుగా సర్దుబాటు చేయదగిన హైట్స్ తో, యాంటీ-స్కిడ్ డిజైన్ తో ఈ ల్యాప్టాప్ స్టాండ్ లభిస్తుంది, దీనిని బెడ్ సైడ్ టేబుల్ గా లేదా ఫోన్ హోల్డర్ గా ఉపయోగించుకోవచ్చు. దీనిని మన్నికైన, రీసైకిల్ చేయగల హెచ్ఐపిఎస్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. దీని ధర రూ.1099.(Amazon)
(3 / 5)
గయాటాప్ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్: ఇది మల్టీ టాస్కింగ్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్. ఇందులో సురక్షితమైన సాఫ్ట్ టీపీఈ బ్లేడ్లు ఉంటాయి. అలాగే, యుఎస్బీ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండీగా ఉండే ఫోల్డబుల్ డిజైన్ తో ఉన్న ఈ ఫ్యాన్ 24 గంటల పాటు కూలింగ్ ను అందిస్తుంది. ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. దీని ధర రూ.629గా ఉంది.(Amazon)
(4 / 5)
ఏపీటెక్ డీల్స్ హెచ్ టీసీ-1 హైగ్రోమీటర్ థర్మామీటర్: పెద్ద ఎల్ సీడీ డిస్ ప్లేతో మన్నికైన ప్లాస్టిక్ నిర్మాణం. ఉష్ణోగ్రత (-10°C~+50°C) మరియు తేమ (10%~99%RH) ను ఖచ్చితంగా కొలుస్తుంది. ఇంటిగ్రల్-అవర్ అలారం ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. దీనిని వాల్-మౌంటెడ్ గా కానీ, లేదా డెస్క్ టాప్ గా కానీ ఉంచవచ్చు.(Amazon)
ఇతర గ్యాలరీలు