Smartphone brand : ఇండియాలో నెంబర్.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వివో! సామ్సంగ్ డౌన్..
Best smartphone brand in India : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ షిప్ మెంట్.. గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇక వివో అత్యధిక మార్కెట్ వాటాను పొందిందని నివేదికలు చెబుతున్నాయి.
Vivo Smartphone brand in India : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. 2024 జనవరి- మార్చ్ త్రైమాసికంలో ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో వివో సంస్థ నెంబర్.1 పొజిషన్ తీసుకుంది. సామ్సంగ్ 3వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు.. ఈ త్రైమాసికంలో మొత్తం స్మార్టఫోన్ షిప్మెంట్ 8శాతం (ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధిని సాధించగా.. మొత్తం వాల్యూ పరంగా 18శాతం వృద్ధి నమోదైంది. మార్కెట్ షేరు విషయంలో.. షావోమీ, సామ్సంగ్ని వివో వెనక్కి నెట్టేసింది.
వివో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది
న్యూ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం.. వివో మొదటిసారి భారతదేశంలో 19.5 శాతం వాల్యూమ్ వాటాను నమోదు చేసింది. ఇది సామ్సంగ్ కంటే ఎక్కువ! 5జీ లీడర్షిప్, సీఎంఎఫ్ (కలర్, మెటీరియల్, ఫినిషింగ్) పొజిషనింగ్‌తో పాటు బలమైన ఇమేజింగ్ సామర్థ్యాల కారణంగా ఈ త్రైమాసికంలో చైనా కంపెనీ మార్కెట్ వాటా పెరిగిందని రీసెర్చ్ అనలిస్ట్ శుభమ్ సింగ్ తెలిపారు.
ఈ నివేదికలో సామ్సంగ్ 17.5 శాతం వాటాతో షియోమీ కంటే దిగువన, మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రీమియం మార్కెట్ సెగ్మెంట్లో మాత్రం సామ్సంగ్ ఆధిపత్యం చెలాయించింది. భారతదేశంలో, సామ్సంగ్ సేల్ ప్రైజ్ 425 డాలర్లుగా ఉంది. ఇది భారతదేశంలో విక్రయించే తన స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ సాధించిన అత్యధిక సగటు ధర.
భారత్‌లో ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా..
Samsung smartphones market share in India : మరోవైపు తాజా ఐఫోన్ 15 సిరీస్ కారణంగా ప్రీమియం మార్కెట్లో యాపిల్ కూడా భారత్‌లో రికార్డు స్థాయి వాటాను నమోదు చేసింది. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదిక ప్రకారం 2024 క్యూ1లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 6 శాతం మార్కెట్ వాటాను అందుకుంది. ఐఫోన్ 15 సిరీస్‌కు పెరుగుతున్న డిమాండ్ దాని మొత్తం ఎగుమతుల్లో 60 శాతానికి దోహదపడుతోంది!
ఇప్పుడు మిడ్ రేంజ్, ప్రీమియం విభాగంలో అనేక స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో కొత్త త్రైమాసికం ప్రారంభమైంది. అదనంగా, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సామ్సంగ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్ సంస్థలు వరుసగా మోడల్స్‌ని లాంచ్ చేయనున్నాయి. వాటిపై చాలా ఆశలు కలిగి ఉన్నాయి. అందుకే 2024 రెండో భాగం ఆయా కంపెనీలకు మరింత కీలకంగా మారనున్నాయి. కౌంటర్ పాయింట్ నివేదిక కూడా 2024 లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సింగిల్ డిజిట్లో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.
సంబంధిత కథనం