Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్5 లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలివే!
07 April 2024, 11:50 IST
- Poco X5 5G price in India : Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్5 లాంచ్ అయ్యింది. ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇదిగో పోకో ఎక్స్5 5జీ.. సూపర్ ఫీచర్స్‌ని చెక్ చేయండి..
Poco X5 5G launch date in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. కొత్త గ్యాడ్జెట్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు పోకో ఎక్స్5 5జీ. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ స్క్రీన్, 5జీ సపోర్ట్ వంటివి ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌కి లభిస్తున్నాయి. ఇక ఈ గ్యాడ్జెట్ స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
పోకో ఎక్స్5 5జీ ధర, లభ్యత..
పోకో ఎక్స్5 5జీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్లో 6 జీబీ ర్యామ్- 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక.. మరో వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.20,999గా ఉంది. ఈ రెండు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్‌ని ధరలను చూస్తే స్పష్టమైపోతోంది.
పోకో ఎక్స్5 5జీ ఫోన్ సూపర్నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఏప్రిల్ 21న కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లోకి వెళ్లనుంది.
Poco X5 5G price in India : పోకో ఎక్స్5 5జీ కొనుగోలుపై లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి! ఐసీఐసీఐ కార్డుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.2,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
పోకో ఎక్స్ 5 5జీ స్పెసిఫికేషన్లు..
పోకో ఎక్స్5 5జీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మరియు 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. సన్‌లైట్ మోడ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 1200నిట్స్ బ్రైట్‌నెస్‌ని పొందింది.
Poco X5 5G features : ఈ పోకో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది సంస్థ. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్. కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. హెచ్డీర్, నైట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్ల సైతం ఇందులో లభిస్తున్నాయి.
సెల్ఫీల కోసం పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ53 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
Poco X5 5G : 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ డివైజ్ కేవలం 22 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.