Tata Tiago EV price hike : టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!
10 February 2023, 13:28 IST
- Tata Tiago EV prices increased : టాటా టియాగో ఈవీ ధరలు పెరిగాయి. ప్రతి వేరియంట్‌పై రూ. 20వేలు పెంచింది టాటా మోటార్స్. తాజా ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!
Tata Tiago EV prices increased : దేశంలోని అతి చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్‌గా గుర్తింపు పొందింది టాటా టియాగో ఈవీ. బుకింగ్స్ పరంగా రికార్డులు సృష్టించింది ఈ ఈవీ. ఒక్క రోజులోనే 10వేలకుపైగా యూనిట్లు బుక్ అయ్యాయి. ఇక నెల రోజుల వ్యవధిలో బుకింగ్స్ సంఖ్య 20వేలు దాటిపోయింది. ఈ ఈవీ డెలవరీలు ఇటీవలే మొదలయ్యాయి. ఇక ఇప్పుడు టియాగో ఈవీ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
టాటా టియాగో ఈవీ ధర..
ఇంట్రొడక్టరీ ప్రైజ్ కింద టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.69లక్షలుగా ఉంది. అది రూ. 11.99లక్షల వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు వేరియంట్‌పై రూ. 20వేల వరకు పెంచింది టాటా మోటార్స్.
Tata Tiago EV on road price Hyderabad : టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. అవి 19.2కేడబ్ల్యూహెచ్, 24కేడబ్ల్యూహెచ్. మొదటికి 250కి.మీల రేంజ్ ఇస్తుంటే.. రెండోదానికి 315కి.మీల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
Tata Tiago EV vs Citroen eC3 : ఈ రెండు ఈవీల మధ్య ది బెస్ట్ ఏదనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా పెంపుతో.. 19.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 3.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్ ఉండే ఎక్స్ఈ వేరియంట్ ధర 8.69లక్షలకు చేరింది. ఎక్స్‌టీ వేరియంట్ ధర రూ. 9.29లక్షలకు పెరిగింది.
Tata Tiago EV price hike : ఇక 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్ ఉన్న ఎక్స్‌టీ వేరియంట్ ధర రూ. 10.19లక్షలుగాను, ఎక్స్జెడ్+ వేరియంట్ ధర రూ. 10.99లక్షలుగాను, ఎక్స్జెడ్+ టెక్ ఎల్యూఎక్స్ ధర రూ. 11.49లక్షలుగాను ఉంది.
మరోవైపు 24కేడబ్ల్యూహెచ్, 7.2కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ఆప్షన్, ఎక్స్జెడ్+ వేరియంట్ ధర రూ. 11.49లక్షలు, ఎక్స్జెడ్+ టెక్ ఎల్యూఎక్స్ ధర రూ. 11.99లక్షలుగాను ఉంది.
టాటా టియాగో ఈవీ- ఇంజిన్..
Tata Tiago EV delivery : 19.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న 45కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్.. 110ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్‌ను కేవలం 6.2సెకన్లలో అందుకుంటుంది. ఇక 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న 55 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్.. 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్‌ను కేవలం 5.7సెకన్లలో అందుకుంటుంది.
టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్ ఈసీ3 నుంచి పోటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఇవీ ఈ నెలలోనే మార్కెట్లో లాంచ్కానుంది. సిట్రోయెన్ ఈసీ3 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాపిక్