Citroen eC3 bookings : సిట్రోయెన్​ ఈసీ3 బుకింగ్స్​ షురూ.. ఇలా బుక్​ చేసుకోండి-citroen ec3 bookings opened know how to book one and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Citroen Ec3 Bookings Opened Know How To Book One And Other Details Here

Citroen eC3 bookings : సిట్రోయెన్​ ఈసీ3 బుకింగ్స్​ షురూ.. ఇలా బుక్​ చేసుకోండి

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 23, 2023 11:32 AM IST

Citroen eC3 bookings : సిట్రోయెన్​ ఈసీ3 బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో ఈ ఈవీ లాంచ్​కానుంది.

సిట్రోయెన్​ ఈసీ3 బుకింగ్స్​ షురూ.. ఇలా బుక్​ చేసుకోండి
సిట్రోయెన్​ ఈసీ3 బుకింగ్స్​ షురూ.. ఇలా బుక్​ చేసుకోండి

Citroen eC3 bookings : ఫ్రెంచ్​ దిగ్గజ ఆటో సంస్థ సిట్రోయెన్​ నుంచి ఇండియాలో మొదటి ఈవీ లాంచ్​కానుంది. అదే సిట్రోయెన్​ ఈసీ3! వచ్చే నెల నుంచి ఈ ఈవీ ఇండియా రోడ్డు మీద చక్కర్లు కొట్టనుంది. ఇక ఇప్పుడు ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఈవీ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

సిట్రోయెన్​కు చెందిన లా మైసన్​ డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఈవీని బుక్​ చేసుకోవచ్చు. ఇందుకు రూ. 25వేలు అడ్వాన్స్​ కింది చెల్లించాల్సి ఉంటుంది. సిట్రోయెన్​ అధికారిక వెబ్​సైట్​లోనూ ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ను బుక్​ చేసుకోవచ్చు.

సిట్రోయెన్​ ఈసీ3.. టాటా టియాగోకు పోటీగా!

Citroen eC3 on road price : సీ5 ఎయిర్​క్రాస్​ ఎస్​యూవీతో 2021లో ఇండియా మార్కెట్​లోకి గ్రాండ్​గా ఎంట్రీ ఇచ్చింది సిట్రోయెన్​ ఆటో సంస్థ. ఇక గతేడాది లాంచ్​ అయిన సిట్రోయెన్​ సీ3.. ఈ ఆటో సంస్థకు బెస్ట్​ సెల్లింగా ఉంది. సిట్రోయెన్​ ఈసీ3 అనేది.. సీ3కి ఎలక్ట్రిక్​ వర్షెన్​!

సిట్రోయెన్​ ఈసీ3 పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం, ఎత్తు 1,586ఎంఎం. రూఫ్​ రెయిల్స్​తో కలుపుకుని 1,604 ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,540ఎంఎం.

Citroen eC3 first drive review వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సిట్రోయెన్​ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్​తో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. ఇది 57పీఎస్​ పవర్​ను, 143ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఈవీ 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. 10-100శాతం ఛార్జింగ్​కు 15ఏ ప్లగ్​ పాయింట్​తో 30 నిమిషాలు పడుతుందని సమాచారం. ఇక డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​తో 10-80శాతం ఛార్జింగ్​కు 57 నిమిషాలు పడుతుందని తెలుస్తోంది.

Citroen eC3 features : సిట్రోయెన్​ ఈసీ3 ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.99లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయిన తర్వాత.. ఈ సిట్రోయెన్​ ఈసీ3.. టాటా టియాగోకి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.

Citroen eC3 vs Tata Tiago EV : ఈ రెండు ఈవీల మధ్య ది బెస్ట్​ ఏదనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం