Tata Punch SUV : టాటా పంచ్ @3,00,000- బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్!
04 January 2024, 12:45 IST
- Tata Punch SUV : టాటా పంచ్ ఎస్యూవీ సరికొత్త మైలురాయిని తాకింది. 3లక్షల సేల్ మార్క్‌ని హిట్ చేసింది.
టాటా పంచ్ @3,00,000- బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్!
Tata Punch SUV : టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా పంచ్.. సరికొత్త మైలురాయిని హిట్ చేసింది! 3లక్షలకుపైగా టాటా పంచ్ యూనిట్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఫొటోను విడుదల చేసింది.
టాటా పంచ్ ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్..!
2021 అక్టోబర్‌లో టాటా పంచ్‌ని లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అప్పటి నుంచి ఈ మోడల్‌కి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది. లాంచ్ అయిన 9 నెలల్లోనే ఒక లక్ష మైలురాయిని తాకింది. ఆ తర్వాత 5 నెలలకు, అంటే 2023 జనవరిలో మరో 50వేల యూనిట్లను విక్రయించింది సంస్థ. ఇక 2లక్షల సేల్స్ మైలురాయిని 2023 మే నాటికి రీచ్ అయ్యింది. ఇక తాజాగా.. జనవరిలో, అంటే 2ఏళ్ల మూడు నెలలకు 3 లక్షల మైల్‌స్టోన్‌ని హిట్ చేసింది.
Tata Punch on road price in Hyderabad : నెక్సాన్ ఎస్యూవీ తర్వాత.. టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది ఈ టాటా పంచ్. సగటున 10వేల యూనిట్లు అమ్ముడుపోతుండటం విశేషం. ఇక ఇండియాలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో స్థానం సంపాదించుకుంది.
ఈ టాటా పంచ్ ఎస్‌యూవీలో 1.2 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 85 హెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా.. టాటా పంచ్ సీఎన్జీ మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో.. డ్యూయెల్ సిలిండర్ ఐసీఎన్జీ టెక్నాలజీ ఉంటుంది.
టాటా పంచ్ వేరియంట్లు- ధర..
Tata Punch SUV sales : టాటా పంచ్ ఎస్‌యూవీలో మొత్తం 8 వేరియంట్లు ఉన్నాయి. ప్యూర్, ప్యూర్ (ఓ) బేస్ వేరియంట్లు మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. అడ్వెంచర్, అడ్వెంచర్ (ఓ), అకంప్లీష్డ్, అంకప్లీష్డ్ (ఓ), క్రియేటివ్, క్రియేటివ్ (ఓ) వేరియంట్స్‌లో ఎంటీతో పాటు ఏఎంటీ ఆప్షన్స్ ఉంటాయి.
ఇక ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- పూ, 9.5లక్షల మధ్యలో ఉంటుంది.
టాటా పంచ్ ఎస్‌యూవీలో పుష్- బటన్ స్టార్ట్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్వీఎం, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రేర్ సీట్ ఆర్మ్‌రెస్ట్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్తో పాటు ఇతర ఫీచర్స్ ఉంటాయి.
ఇక ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో.. హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తోంది టాటా పంచ్.
టాటా పంచ్ ఈవీ కోసం ఎదురుచూపులు..
Tata Punch EV launch in India : టాటా పంచ్ ఎస్యూవీ దుమ్మురేపింది. ఇక ఇప్పుడు టాటా పంచ్ ఈవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ మోడల్ 2023లోనే లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ.. సంస్థ ఎందుకో దీనిని ఆలస్యం చేస్తూ వస్తోంది. కాగా.. ఈ 2024లో ఈ టాటా పంచ్ ఈవీ కచ్చితంగా లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
టాటా పంచ్ ఈవీ ఎంట్రీతో.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ లైనప్ మరింత పటిష్ఠంగా మారనుంది. సంస్థ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ మోడల్స్ బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి.