తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Tata Electric Cars: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 2.6 లక్షల వరకు డిస్కౌంట్.. త్వరపడండి.. ఈ నెలాఖరు వరకే ఆఫర్

Discounts on Tata electric cars: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 2.6 లక్షల వరకు డిస్కౌంట్.. త్వరపడండి.. ఈ నెలాఖరు వరకే ఆఫర్

HT Telugu Desk HT Telugu

15 December 2023, 13:55 IST

  • Discounts on Tata electric cars: ఈయర్ ఎండింగ్ ఆఫర్స్ (year-end discounts) లో భాగంగా టాటా మోటార్స్ తన లైనప్ లోని ఎలక్ట్రిక్ కార్లపై  భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.

టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఈవీ

Discounts on Tata electric cars: ఎలక్ట్రిక్ కార్ల (electric car) పై బంపర్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ (year-end discounts) ఆఫర్స్ ను టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ డిసెంబర్ 31 లోగా బుక్ చేసుకున్న వారికి ఏకంగా, రూ. 2.6 లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Royal Enfield Guerrilla 450 : అదిరిపోయేలా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- లాంచ్​ ఎప్పుడు?

టాటా ఎలక్ట్రిక్ కార్లు..

టాటా మోటార్స్ (Tata Motors) కార్లలో నెక్సాన్ (Nexon), టియాగో (Tiago), టిగోర్ (Tigor) మోడల్స్ లో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వాటిపై డిసెంబర్ 31 వరకు, లేదా స్టాక్స్ ముగిసేవరకు వర్తించేలా ఈ డిస్కౌంట్లను టాటా మోటార్స్ ప్రకటించింది.

Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ఫేస్ లిఫ్ట్ (Nexon facelift) వర్షన్ ను ఈ సెప్టెంబర్ నెలలో లాంచ్ చేశారు. ప్రస్తుతం భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్ మార్కెట్లోకి రాకముందు మార్కెట్లో ఉన్న నెక్సాన్ ఈవీ మోడల్స్ పై భారీ డిస్కౌంట్ ను టాటా మోటార్స్ ప్రకటించింది. ఫేస్ లిఫ్ట్ వర్షన్ కన్నా ముందు మార్కెట్లోకి వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) , టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్లపై రూ. 2.6 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ప్రైమ్ వేరియంట్ (Tata Nexon EV Prime) రూ. 1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ. 50 వేల ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. టాటా నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్ పై రూ. 2.1 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ. 50 వేల ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే, మొత్తంగా మ్యాక్స్ వేరియంట్ పై రూ. 2.6 లక్షలు, ప్రైమ్ వేరియంట్ పై రూ. 1.9 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ప్రి ఫేస్ లిఫ్ట్ మోడల్స్ లో నెక్సాన్ ప్రైమ్ రూ. 14.5 లక్షల నుంచి రూ. 17.19 లక్షల శ్రేణిలో లభిస్తుంది. అలాగే, నెక్సాన్ మ్యాక్స్ రూ. 16.49 లక్షల నుంచి రూ. 19.54 లక్షల శ్రేణిలో లభిస్తుంది.

Tigor EV: టాటా టైగోర్ ఈవీ

టాటా టైగోర్ (Tigor EV) ఈవీ ప్రస్తుత ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 12.40 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉంది. దీనిపై ప్రస్తుత ఈయర్ ఎండ్ ఆఫర్ లో రూ. 1.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 50 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 50 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 10 వేలు కార్పొరేట్ బెనిఫిట్.

Tiago EV: టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీ ప్రస్తుత ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 8.69 లక్షల నుంచి రూ. 12.04 లక్షల మధ్య ఉంది. దీనిపై ప్రస్తుత ఈయర్ ఎండ్ ఆఫర్ లో రూ. 77 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 55 వేలు గ్రీన్ బోనస్, రూ. 15 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 7 వేలు కార్పొరేట్ బెనిఫిట్.

తదుపరి వ్యాసం