తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Cng : లాంచ్​కి ముందు.. టాటా నెక్సాన్​ సీఎన్జీపై బిగ్​ అప్డేట్​!

Tata Nexon CNG : లాంచ్​కి ముందు.. టాటా నెక్సాన్​ సీఎన్జీపై బిగ్​ అప్డేట్​!

Sharath Chitturi HT Telugu

25 August 2024, 12:10 IST

google News
    • Tata Nexon CNG launch date : లాంచ్​కి ముందు టాటా నెక్సాన్​ సీఎన్జీపై బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్​లో కూడా లభిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాటా నెక్సాన్​ సీఎన్జీ
టాటా నెక్సాన్​ సీఎన్జీ

టాటా నెక్సాన్​ సీఎన్జీ

2024 మచ్​ అవైటెడ్​ లాంచ్​లలో టాటా నెక్సాన్ సీఎన్జీ ఒకటి. ఇది రాబోయే పండుగ సీజన్​కి ముందు, సెప్టెంబర్​లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ మాదిరిగానే టాటా నెక్సాన్​ సీఎన్జీ కూడా ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్) టెక్నాలజీని పొందుతుంది. దేశీయ ఆటో దిగ్గజం ఈ ఏడాది ప్రారంభంలో టియాగో- టిగోర్ మోడళ్లలో సీఎన్జీ-ఏఎంటీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఇదే సాంకేతికత నెక్సాన్​లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్​యూవీ ఆకర్షణను మరింత పెంచుతుంది.

టియాగో సీఎన్జీ-ఏఎంటీ, టిగోర్ సీఎన్జీ -ఏఎంటీ మాదిరిగానే, టాటా నెక్సాన్ సీఎన్జీ-ఏఎంటీ కూడా ట్విన్-సీఎన్జీ సిలిండర్లు ఏఎంటీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత వినియోగదారులకు అఫార్డిబుల్​ ఫ్యూయెల్​, సౌకర్యవంతమైన క్లచ్ లెస్ డ్రైవింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

టాటా నెక్సాన్ సీఎన్జీ: ఇంజిన్​- స్పెసిఫికేషన్స్​..

టాటా నెక్సాన్ సీఎన్జీ రెండు వేర్వేరు ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​తో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​, ఏఎంటీ యూనిట్ ఉంటాయి. ఈ ఎస్​యూవీలో 1.2-లీటర్ టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సీఎన్జీపై కూడా పనిచేయగలదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118బీహెచ్​పీ పవర్, 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది సీఎన్జీ మోడ్​లో, ఎస్​యూవీ కొంచెం తక్కువ పవర్, టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఇదీ చూడండి:- Motor vehicle tax : ప్రజలపై ప్రభుత్వం ‘ట్యాక్స్​’ పిడుగు! భారీగా పెరగనున్న వాహనాల ధరలు..

టాటా నెక్సాన్​ కాంపాక్ట్ ఎస్​యూవీ ప్రస్తుతం పెట్రోల్-ఓన్లీ, డీజిల్-ఓన్లీ, ఎలక్ట్రిక్ వెహికిల్​ ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది. పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయెల్ పవర్ట్రెయిన్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్​, టాటా పంచ్ మాదిరిగానే నెక్సాన్​కి కూడా సీఎన్జీ టెక్నాలజీని జోడించడం జరుగుతుంది.

టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీ-ఏఎంటీ ధర గురించి ఇంకా వెల్లడించలేదు. ఇది నెక్సాన్ స్టాండర్డ్​ వెర్షన్ల కంటే సుమారు రూ .80,000 ప్రీమియంతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. టాటా నెక్సాన్ సీఎన్జీ లాంచ్ అయిన తరువాత మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ వంటి మోడల్స్​కి గట్టి పోటీని ఇస్తుంది.

తదుపరి వ్యాసం