టాటా నెక్సాన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్ యూవీలలో ఒకటి. 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. 5 స్టార్ క్రాష్ రేటింగ్ తో అత్యంత సురక్షితమైన ఎస్యూవీగా టాటా నెక్సాన్ పేరుగాంచింది.
ఈ ఆగస్టులో, టాటా మోటార్స్ దాదాపు అన్ని నెక్సాన్ వేరియంట్లపై రూ .1,00,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా నెక్సాన్ లో స్మార్ట్, స్మార్ట్ (ఓ), స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ +, క్రియేటివ్ + ఎస్, ఫియర్ లెస్, ఫియర్ లెస్ ఎస్, చివరగా ఫియర్ లెస్ + వేరియంట్లు ఉన్నాయి. అయితే, టాటా నెక్సాన్ పై టాటా మోటార్స్ (Tata motors) ప్రకటించిన డిస్కౌంట్లలో వేరువేరు రాష్ట్రాల్లో తేడాలు ఉండవచ్చు. మీకు నచ్చిన నెక్సాన్ మోడల్ పై లభించే డిస్కౌంట్ గురించి తెలుసుకోవడానికి మీ సమీప టాటా మోటార్స్ డీలర్ షిప్ ను సంప్రదించండి. అలాగే, డిస్కౌంట్ పై ఉన్న వేరియంట్లలో స్మార్ట్ (ఓ), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్ అనే మూడింటిని మినహాయించారు.
టాటా నెక్సాన్ వేరియంట్లపై ఈ ఆగస్ట్ లో లభించే డిస్కౌంట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
టాటా కర్వ్ కోసం ప్రకటించిన 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ను నెక్సాన్ లో కూడా అందించనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. డీజిల్ 1.5-లీటర్ క్రయోజెట్ ఇంజన్ 116 బీహెచ్ పీ పవర్, 260 గరిష్ట ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.