Mahindra XUV 3XO EV : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓకి ‘ఈవీ’ టచ్- టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా..!
Mahindra XUV 3XO EV : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు సంస్థ రెడీ అవుతోంది. టాటా నెక్సాన్‌కి పోటీగా ఈ మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ఇండియా మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌కి మంచి డిమాండ్ ఉంది. దానిని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని తీసుకొస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు, తమ ఐసీఈ వెహికిల్స్‌కి ఈవీ టచ్ ఇస్తున్నాయి. ఇక ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా ఇటీవలే లాంచ్ అయిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో ఈవీ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ టెస్ట్ డ్రైవ్ ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీని ప్రవేశపెట్టడం ద్వారా సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌ని విస్తరించే పనిలో పడింది. కాంపాక్ట్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ వర్షెన్ ఇటీవల భారత రోడ్లపై కనిపించింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మహీంద్రా లైనప్‌లోని ఎక్స్‌యూవీ400 కంటే దిగువన ఉంటుంది. అంతేకాదు ఈవీ సెగ్మెంట్లో భారీ మార్కెట్ షేరు కలిగిన టాటా నెక్సాన్ ఈవీకి ఈ కొత్త మోడల్ పోటీగా ఉంటుంది.
స్పై షాట్స్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ కామోఫ్లాజ్తో కనిపించింది. ఈవీ వర్షెన్ నుంచి ఐసీఈ వర్షెన్‌ను వేరు చేయడంలో సహాయపడే కొన్ని డిజైన్ మార్పులు ఉంటాయని ఆశించవచ్చు.
హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ వంటివి ఎక్స్‌యూవీ300 మాదిరిగానే ఉంటాయి. రీడిజైన్ చేసిన గ్రిల్, కొంచెం భిన్నమైన బ్యాడ్జింగ్, భిన్నమైన బంపర్ల సెట్ కూడా ఉండవచ్చు. ఎక్స్‌యూవీ పొడవు ఎక్స్‌యూవీ400 కంటే 200 మిమీ చిన్నది. దీనికి చిన్న బూట్ స్పేస్ ఉంటుంది. ఎక్స్‌యూవీ400 బూట్ స్పేస్ 378 లీటర్లు. ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరచడానికి ఏరో ఇన్సర్ట్లతో పాటు కొత్త అలాయ్ వీల్స్ ఉండవచ్చు.
ఎక్స్‌యూవీ 400లో 34.5 కిలోవాట్ల సామర్థ్యం, 39.5 కిలోవాట్ల బ్యాటరీని అందించారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీని చిన్న 34.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లాంచ్ చేయవచ్చు. కాబట్టి, ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్లెయిమ్ రేంజ్ సుమారు 375 కిలోమీటర్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇది ఏసీ, డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్లపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఎక్స్‌యూవీ 400లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 148బీహెచ్పీ పవర్, 310ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ ఓ కోసం, మహీంద్రా అదే మోటార్ రీట్యూన్డ్ వర్షెన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఫలితంగా పవర్, టార్క్ తగ్గొచ్చు.
ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 లాంచ్, ఫీచర్స్, ధరపై ప్రస్తుతానికి సమాచారం అందుబాటులో లేదు. త్వరలోనే అప్డేట్స్ రావొచ్చు.
మరోవైపు మహీంద్రాకు ప్రస్తుతం ఒక్కటే ఈవీ ఉంది. అది ఎక్స్‌యూవీ400. కానీ పలు కీలక మోడల్స్‌ని సంస్థ తన లైనప్‌లో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుత మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓతో పాటు ఎక్స్‌యూవీ700 ఈవీ, థార్ ఈవీ, స్కార్పియో ఈవీకి సంబంధించిన ప్రాజెక్ట్స్‌పై సంస్థ పనిచేస్తోంది. వీటి లాంచ్‌పై అప్డేట్స్ అందాల్సి ఉంది.
సంబంధిత కథనం