Tata Motors share : భారీగా పెరిగిన టాటా మోటార్స్ స్టాక్.. షేర్ ప్రైజ్ టార్గెట్ రూ. 620?
10 April 2023, 11:50 IST
- Tata Motors share price target in Telugu : సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా ర్యాలీ అవుతున్న టాటా మోటార్స్ స్టాక్.. ఇంకా పెరుగుతుందా? ఈ స్టాక్ ప్రైజ్ టార్గెట్ ఏంటి? బ్రోకరేజీ సంస్థలు ఏం చెబుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి.
టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్ రూ. 620!
Tata Motors share price target : సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ.. టాటా మోటార్స్ షేర్లు దూసుకెళుతున్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో దాదాపు 8శాతం మేర లాభపడిన ఈ స్టాక్.. ఉదయం 11:20కి 6శాతం వృద్ధిచెంది రూ. 463 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 టాప్ గెయినర్స్‌లో మొదటి స్థానంలో ఉంది. జాగ్వర్ ల్యాండ్ రోవర్‌తో పాటు సంస్థ అంతర్జాతీయ సేల్స్ 8శాతం వృద్ధిచెందడం.. టాటా మోటార్స్ షేర్లు దూసుకెళడానికి ప్రధాన కారణం అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్ వెల్లడించారు.
"టాటా మోటార్స్ స్టాక్ 18నెలల కన్సాలిడేషన్ దశ నుంచి క్లాసికల్ సిమ్మెట్రిక్ ట్రైయాంగిల్ ఛార్ట్ పాటర్న్ బ్రేకౌట్ ఇచ్చింది. అంటే.. ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ఛార్ట్ పాటర్న్ టార్గెట్ రూ. 620. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న లెవల్ నుంచి దాదాపు 30శాతం ఎక్కువ. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. రూ. 440- రూ. 425 జోన్ వద్ద మంచి డిమాండ్ కనిపించవచ్చు," అని స్వాస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ సంతోష్ మీనా వెల్లడించారు.
టాటా మోటార్స్ హోల్‌సేల్ డేటా జోష్..
Tata Motors share price : ఎఫ్వై23 క్యూ4 గ్లోబల్ హోల్‌సేల్ డేటాను శుక్రవారం ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. 3,61,361 యూనిట్లను విక్రయించినట్టు వివరించింది. ఇయర్ ఆన్ ఇయర్‌తో పోల్చుకుంటే ఇది 8శాతం ఎక్కువ! ముఖ్యంగా జేఎల్ఆర్ బిజినెస్ మెరుగుపడటం స్టాక్‌కు కలిసివచ్చింది.
తాజా పరిణామాల మధ్య అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మాన్ సాక్స్.. టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 544గా పేర్కొంది. ప్రస్తుత లెవల్స్ నుంచి ఇది 24శాతం ఎక్కువ. మర బ్రోకరేజ్ సంస్థ నోమురా.. ఈ స్టాక్ టార్గెట్ ప్రైజ్‌ను రూ. 508గా వెల్లడించింది.
Tata Motors share price target in Telugu : "టాటా మోటార్స్‌కు చెందిన మూడు వ్యాపారాలు రికవరీ దశలో ఉన్నాయి. ఇండియా సీవీ బిజినెస్‌లో సిక్లికల్ రికవరీ కనిపిస్తుంటే.. పీవీ సెగ్మెంట్ మాత్రం స్ట్రక్చరల్‌గా గ్రో అవుతోంది. జేఎల్ఆర్లో కూడా సిక్లికల్ గ్రోత్ కనిపిస్తోంది. అయితే.. ఈ రికవరీ ప్రక్రియను సప్లై- చెయిన్ వ్యవస్థలోని సమస్యలు వెంటాడే అవకాశం ఉంది," అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ పేర్కొంది.
టాటా మోటార్స్ స్టాక్ హిస్టరీ..
Tata Motors stock history : టాటా మోటార్స్ షేరు గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో 12శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో 6శాతం వృద్ధిచెందింది. ఇక ఆరు నెలల వ్యవధిలో 17శాతం మేర లాభపడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17.55శాతం పెరిగిన టాటా మోటార్స్ షేరు ధర.. ఏడాది కాలంలో 2.67శాతం మేర లాభపడింది.