Tata Cars Sale: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్.. ఈ నాలుగు కార్లకు ఫుల్ గిరాకీ-tata motors records highest ever annual sales in fy2023 nexon punch harrier led ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Cars Sale: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్.. ఈ నాలుగు కార్లకు ఫుల్ గిరాకీ

Tata Cars Sale: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్.. ఈ నాలుగు కార్లకు ఫుల్ గిరాకీ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 02, 2023 03:05 PM IST

Tata Cars Sale: 2023 ఆర్థిక సంవత్సరం (FY2023)లో టాటా మోటార్స్ అమ్మకాలు దూసుకెళ్లాయి. అత్యధిక వార్షిక అమ్మకాలను ఆ సంస్థ నమోదు చేసింది. వివరాలివే.

Tata Cars Sale: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్
Tata Cars Sale: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్ (HT Auto)

Tata Cars Sale: ప్యాసింజర్ వాహనాల (Passenger Vehicles - PVs) అమ్మకాల్లో ప్రముఖ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) అదరగొట్టింది. 2023 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 మధ్య)లో 5,38,640 ప్యాసింజర్ వాహనాలను (Cars) ఆ సంస్థ అమ్మింది. అత్యధిక వార్షిక సేల్స్‌ను సాధించింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 45.43 శాతం వృద్ధిని టాటా మోటార్స్ సాధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 3,70,372 యూనిట్లను టాటా అమ్మింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 5,38,640లక్షలుగా నమోదైంది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్ తర్వాత అతిపెద్ద మూడో సంస్థగా టాటా కొనసాగింది. ఇక ఈ ఏడాది మార్చిలో 44,044 కార్లను టాటా మోటార్స్ విక్రయించింది. వివరాలు ఇవే.

ఈ కార్లు ఎక్కువగా..

Tata Cars Sale: టాటా మోటార్స్ అమ్మకాల్లో టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా హారియర్, టాటా సఫారీ కార్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం సేల్స్‌లో ఈ నాలుగు ఎస్‍యూవీల వాటా 66 శాతంగా ఉంది. దీంతో 2023 ఆర్థిక సంవత్సరంలో 5.38లక్షల మార్కును టాటా మోటార్స్ దాటింది. ఈ సంస్థకు ఇదే అత్యధిక వార్షిక సేల్స్‌గా ఉంది.

Tata Cars Sale: ఈ ఏడాది మార్చిలో 44,044 ప్యాసింజర్ వెహికల్‍లను (ఐసీఈ+ఈవీలతో కలిపి) టాటా మోటార్స్ దేశంలో విక్రయించింది. 2022 మార్చి (42,293)తో పోలిస్తే ఇది నాలుగు శాతం వృద్ధిగా ఉంది. ఇక గత నెల 6,509 ఎలక్ట్రిక్ వాహనాలను ఆ సంస్థ అమ్మింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వృద్ధి సుమారు 89 శాతం వరకు ఉంది.

ఇక 2023 ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్ - 2023 మార్చి)లో టాటా మోటార్స్ మొత్తంగా 50,043 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో నంబర్ వన్‍గా నిలిచింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 19,668 ఈవీ యూనిట్లు అమ్ముడవగా.. ఏకంగా 154 శాతం వృద్ధి నమోదైంది.

కమర్షియల్ వాహనాలు ఇలా..

Tata Motors Sales: ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ 3,93,317 కమర్షియల్ వాహనాలను (Commercial Vehicle - CV) విక్రయించింది. కిందటి ఆర్థిక సంవత్సరం (3,22,182)తో పోలిస్తే 22 శాతం వృద్ధిని కనబరిచింది. అయితే విదేశీ ఎగుమతుల విషయంలో 42 శాతం క్షీణతను ఆ సంస్థ నమోదు చేసింది. ఇక ఈ ఏడాది మార్చిలో 45,307 కమర్షియల్ వాహనాలను టాటా మోటార్స్ విక్రయించింది. 1,516 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం