Tata Harrier facelift : టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే 7 భారీ మార్పులు..!
15 October 2023, 11:50 IST
- Tata Harrier facelift : కొత్త టాటా హారియర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే 7 భారీ మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే మార్పులివే!
Tata Harrier facelift : దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇప్పుడు.. టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ నెల 17న లాంచ్ అవుతున్న ఈ ఎస్‌యూవీపై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. ఈ మోడల్‌కు సంస్థ భారీ మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాము..
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే మార్పులు..
టాటా మోటార్స్ సంస్థ మంచి జోరు మీద ఉంది! కొన్ని వారాల క్రితమే.. టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీలకు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను లాంచ్ చేసిన సంస్థ.. ఇప్పుడు హారియర్‌పై ఫోకస్ చేసింది.
రీడిజైన్డ్ ఎక్స్టీరియర్:- టాటా నెక్సాన్‌లో జరిగినట్టే.. హారియర్ ఎక్స్టీరియర్లో కూడా డిజైన్ పరంగా భారీ మార్పులే జరిగాయి! ఫ్రెంట్, రేర్ మారిపోయాయి. ఇందులో వర్డికల్ బంపర్ మౌంటెడ్ బ్లాక్ హౌజింగ్ ఉండనుంది. బంపర్ మీద కనిపించే.. రేడియేటర్ గ్రిల్- వైడర్ ఎయిర్ ఇంటేక్‌లు మరింత పెద్దగా అయ్యాయి. ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు స్లీక్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వస్తున్నాయి. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్‌కు సీక్వెన్షియల్ పాటర్న్లు వస్తున్నాయి. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ టాటా హారియర్ సొంతం.
Tata Harrier facelift launch date: కనెక్టెడ్ ఎల్ఈడీ స్ట్రిప్స్:- ఈ మధ్యకాలంలో వస్తున్న వాహనాలకు ఫ్రెంట్, రేర్‌లో కనెక్టెడ్ ఎల్ఈడీ స్ట్రిప్స్ సాధారణంగా మారిపోయాయి. సరికొత్త టాటా హారియర్‌లో కూడా వీటిని చూడొచచు. ఈ మోడల్ ఫ్రెంట్, రేర్‌లో కూడా కనెక్టెడ్ ఎల్ఈడీ స్ట్రిప్స్ వస్తున్నాయి.
సరికొత్త కలర్స్:- టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో 7 వివిధ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అవి.. సన్‌లిట్ యెల్లో, పెబుల్ గ్రే, సీవీడ్ గ్రీన్, యాష్ గ్రే, ఒబేరాన్ బ్లాక్, లూనార్ వైట్, కోరల్ రెడ్. మొదటి మూడు కొత్తగా వస్తున్నవి.
వేరియంట్ల పేర్లు:- హారియర్ వేరియంట్ల పేర్లు కూడా మారిపోయాయి. ఇప్పటివరకు వీటిని.. ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌ఎంఎస్, ఎక్స్‌టీ, ఎక్స్జెడ్ అని పిలిచేవారు. ఇక ఇప్పుడు ఇవి.. ప్యూర్, అడ్వెంచర్, స్మార్ట్, ఫియర్లెస్, డార్క్‌గా పేరు మార్చుకున్నాయి. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కి కూడా ఇదే జరిగింది.
Tata Harrier facelift price in Hyderabad : ఇంటీరియర్‌లో ఇలా:- 12.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.2 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు కొత్తగా వస్తున్నాయి. సరికొత్త 10-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టెమ్ లభిస్తోంది. పవర్డ్- వెటిలేటెడ్ సీట్స్ (ముందు రెండింటికి), సన్ బ్లైండ్స్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి కొత్తగా లభిస్తున్నాయి.
సేఫ్టీ ఫీచర్స్:- టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో నీ (మోకాలు) ఎయిర్‌బ్యాగ్‌తో పాటు మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్స్ వస్తున్నాయి. ఫ్రెంట్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటర్, 3 పాయింట్ సీట్‌బెల్ట్, క్రూజ్ కంట్రోల్‌తో కూడిన 11 ఏడీఏఎస్ ఫంక్షన్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కొత్త హారియర్ సొంతం.
ఇంజిన్:- టాటా హారియర్‌లో డీజిల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్ ఇంజిన్.. 168 బీహెచ్పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదొక బీఎస్6 ఫేజ్ 2 కంప్లైంట్. 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్త్తున్నాయి.