తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta Facelift : టెస్ట్​ రన్​ దశలో హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​.. త్వరలోనే లాంచ్​!

Hyundai Creta facelift : టెస్ట్​ రన్​ దశలో హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

25 September 2023, 13:48 IST

google News
    • Hyundai Creta facelift : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కు సంబంధించిన టెస్ట్​ రన్​ నడుస్తోంది. త్వరలోనే ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని సమాచారం.
హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​..
హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​..

Hyundai Creta facelift : ఇండియాలో హ్యుందాయ్​ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది క్రేటా ఎస్​యూవీ. ఈ క్రేటాకు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మోడల్​కు సంబంధించి.. టెస్ట్​ రన్​ను అనేకమార్లు నిర్వహించింది హ్యుందాయ్​. ఇక తాజాగా జరిగిన టెస్ట్​ రన్​లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ క్రేటా..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. సరికొత్త ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​ డిజైన్​ దీని సొంతమవుతుందని సమాచారం.

ఇక ఆన్​లైన్​లో లీకైన స్పై షార్ట్స్​ ప్రకారం.. సరికొత్త క్రేటా ఎస్​యూవీ ఇంటీరియర్​లో ఆల్​ బ్లాక్​ థీమ్​ వస్తోంది. డ్యూయెల్​ టోన్​ సీట్స్​ ఇందులో ఉంటాయి. రేర్​లోని 3 ప్యాసింజర్లకు కొత్తగా హెడ్​రెస్ట్​ వస్తోంది. డాష్​బోర్డ్​ ఎలా ఉంటుందనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ఇందులో డ్యూయెల్​ స్క్రీన్​ సెటప్​ను పెట్టాలని హ్యుందాయ్​ సంస్థ ప్లాన్​ చేస్తోంది. అంతేకాకుండా.. రేర్​లోని ఏసీ వెంట్స్​తో పాటు 2 యూఎస్​బీ టైప్​-సీ ఛార్జర్స్​ కూడా ఈ కొత్త మోడల్​లో చూడొచ్చు.

ఇదీ చూడండి:- Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కొంటున్నారా? ఏడాది 'వెయిట్​' చేయాల్సిందే!

Hyundai Creta facelift 2024 : హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ను అంతర్జాతీయ మార్కెట్​లో ఇప్పటికే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అయితే.. ఇండియాలో లాంచ్​ అయ్యే మోడల్​కు, అంతర్జాతీయ మోడల్​కు మధ్య డిజైన్​ పరంగా అనేక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎస్​యూవీ ఫ్రెంట్​లో వర్టికల్​ ఎల్​ఈడీ లైట్స్​, పారామెట్రిక్​ గ్రిల్ వచ్చే అవకాశం ఉంది. రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ను కొత్త డిజైన్​తో అప్డేట్​ చేయనుంది హ్యుందాయ్​. ఎల్​ఈడీ లైట్​ బార్​ రావొచ్చు. ఇక ఈ హ్యుందాయ్​ క్రేటాలో 17 ఇంచ్​ డైమెండ్​ కట్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయని సమాచారం.

వెర్నా, వెన్యూ, టుక్సాన్​లో ఉన్నట్టుగానే.. ఈ ఎస్​యూవీలో కూడా ఏడీఏఎస్​ టెక్నాలజీతో పాటు ఇతర ముఖ్యమైన ఫీచర్స్​ ఉండనున్నాయి. 360 డిగ్రీ కెమెరా ఫీచర్​ కూడా తొలిసారి ఈ మోడల్​కు రావొచ్చు.

Hyundai Creta facelift launch date in India : ఇక ఈ హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండొచ్చు.

ఈ మోడల్​ లాంచ్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. వీటిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

తదుపరి వ్యాసం