తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Group : పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ!

Tata Group : పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ!

Sharath Chitturi HT Telugu

19 February 2024, 16:47 IST

  • Tata Group market value : మొత్తం పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన దేశంలోని టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూ ఎక్కువగా ఉంది! టాటా గ్రూప్​ సంస్థలు వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు కారణం.

పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ!
పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ! (Reuters)

పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. మన టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ!

Tata Group market value bigger than Pakistan economy : 75ఏళ్ల స్వాతంత్ర్య కాలంలో భారత దేశం.. ఎన్నో గొప్ప సంస్థల వృద్ధిని చూసింది. వాటన్నింటిలో ముందు వరుసలో ఉంటుంది.. టాటా గ్రూప్​. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. ఇక ఇప్పుడు.. భారత దేశం గర్వించే రీతిలో టాటా గ్రూప్ ఎదిగింది అనేేందుకు నిదర్శనంగా ఓ నివేదిక బయటకి వచ్చింది. మొత్తం పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ కన్నా.. ఇండియాలో ఒక్క టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూనే ఎక్కువ ఉండటం విశేషం!

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

టాటా గ్రూప్​ మార్కెట్​ వాల్యూ వర్సెస్​ పాకిస్థాన్​ ఎకనామీ..

టాటా గ్రూప్​లోని అనేక సంస్థలు.. గత ఏడాది కాలంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఫలితంగా.. వాటి మార్కెట్​ క్యాపిటల్​ అమాంతం పెరిగింది. ఎంతలా ఆంటే.. యావత్​ పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థను దాటేసే అంత!

Tata Group market capital : పాకిస్థాన్​ జీడీపీని సుమారు 341 బిలియన్​ డాలర్లుగా అంచనా వేసింది ఐఎంఎఫ్​(అంతర్జాతీయ ద్రవ్య నిధి). కాగా.. ఇండియాలోని టాటా గ్రూప్​ మార్కెట్​ క్యాపిటలైజేషన్​.. 365 బిలియన్​ డాలర్లు. ఇందులో.. ఒక్క టీసీఎస్​ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​) వాటానే 170 బిలియన్​ డాలర్లుగా ఉంది! అంటే.. పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థలో.. మన టీసీఎస్​ సగం ఉంటుంది! అంతేకాకుండా.. ఇండియాలోనే రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది టీసీఎస్​.

టాటా కంపెనీల ప్రదర్శన ఇలా..

టాటా మోటార్స్​, ట్రెంట్​, టైటాన్​, టీసీఎస్​, టాటా పవర్​లో ఏడాది కాలంగా మంచి ట్రాక్షన్​ కనిపిస్తోంది. ఫలితంగా.. టాటా గ్రూప్​ మార్కెట్​ క్యాపిటల్​ పెరుగుతూ వస్తోంది. ఏడాది కాలంలో.. టాటా గ్రూప్​నకు చెందిన కనీసం 8 సంస్థలు.. రెండింతల సంపదను సృష్టించాయి! అవి.. టీఆర్​ఎప్​, బెనారెస్​ హోటల్స్​, టాటా ఇన్​వెస్ట్​మెంట్​ కార్పొరేషన్​, టాటా మోటార్స్​, ఆటోమొబైల్​ కార్పొరేషన్​ ఆఫ్​ గోవా, ఆర్టిసన్​ ఇంజీనిరింగ్​. వీటితో పాటు.. వచ్చే ఏడాదిలో మార్కెట్​లో లిస్ట్​ అవ్వనున్న టాటా క్యాపిటల్​ మార్కెట్​ వాల్యూ.. 2.7 లక్షల కోట్లుగా ఉంది.

బలహీనంగా.. పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ!

Pakistan economy news : పాకిస్థాన్​లో గత కొన్నేళ్లుగా.. ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఎఫ్​వై22లో ఆ దేశ జీడీపి 6.1శాతం వృద్ధిచెందింది. ఎఫ్​వై23లో అది ఇంకా తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. భారీ వరదలు.. పాకిస్థాన్​ను అనేకమార్లు కుదిపేశాయి. ఫలితంగా.. దేశానికి బిలియన్​ డాలర్ల నష్టం వాటిల్లింది. అదే సమయంలో.. అంతర్జాతీయంగా చేసిన అప్పులు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ దేశంపైన 125 బిలియన్​ డాలర్ల వరకు అప్పులున్నాయని తెలుస్తోంది. విదేశీ మారక ద్రవ్యం 8 బిలియన్​ డాలర్ల వద్ద ఉంది.

మరోవైపు.. పాకిస్థాన్​ ప్రజల ఆర్థిక కష్టాలు ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అక్కడ ఎన్నికలు జరిగినా.. ఇంకా ఓ పార్టీ కూడా మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించకపోవడంతో.. రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇవన్నీ పరిష్కారమై, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఇంకాస్త సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం