తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch On Road Price In Hyderabad : హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Tata Punch on road price in Hyderabad : హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

12 February 2024, 15:44 IST

    • Tata Punch price in Hyderabad : టాటా పంచ్​ ఎస్​యూవీని కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్​లో ఈ టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Tata Punch on road price Hyderabad : ఇండియాలో ఎస్​యూవీలకు డిమాండ్​ అంతా ఇంతా లేదు. ఇక టాటా మోటార్స్​కు చెందిన టాటా పంచ్​ ఎస్​యూవీ.. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. 2024 జనవరి సేల్స్​లో టాప్​ 10 ఎస్​యూవీల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. టాటా నెక్సాన్​ని వెనక్కి నెట్టి.. ఫస్ట్​ ప్లేస్​ని దక్కించుకుంది. జనవరిలో టాటా పంచ్​ ఎస్​యూవీకి చెందిన 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరితో పోల్చుకుంటే ఇది 50శాతం ఎక్కువ. ఈ చిన్న ఎస్​యూవీకి క్రేజ్​ ఏ రేంజ్​లో ఉందో దీని బట్టి చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్​లో టాటా పంచ్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

టాటా పంచ్​ ప్యూర్​- రూ. 7,18,718

ప్యూర్​ రిథమ్​- రూ. 7.60 లక్షలు

అడ్వెంచర్​- రూ .8.25 లక్షలు

కామో అడ్వెంచర్​- రూ. 8.36 లక్షలు

Tata Punch price in Hyderabad : ప్యూర్​ సీఎన్​జీ- రూ. 848 లక్షలు

అడ్వెంచర్​ రిథమ్​- రూ. 8.66 లక్షలు

కామో అడ్వెంచర్​ రిథమ్​- రూ. 8.78 లక్షలు

కామో అడ్వెంచర్​ ఏఎంటీ- రూ. 9.07 లక్షలు

కామో అకంప్లీష్డ్​- రూ. 9.31 లక్షలు

అడ్వెంచర్​ ఏఎంటీ రిథమ్​- రూ. 9.36 లక్షలు

అడ్వెంచర్​ సీఎన్​జీ- రూ. 9.36 లక్షలు

కామో అడ్వెంచర్​ ఏఎంటీ రిథమ్​- రూ. 9.48 లక్షలు

కామో అంకప్లీష్డ్​ డాజిల్​- రూ. 9.75 లక్షలు

అడ్వెంచర్​ రిథమ్​ సీఎన్​జీ- రూ. 9.78 లక్షలు

అకంప్లీష్డ్​- రూ. 9.83 లక్షలు

అకంప్లీష్డ్​ ఎస్​- రూ. 9.83 లక్షలు

Tata Punch on road price : కామో అంకప్లీష్డ్​ ఏఎంటీ- రూ. 10.01 లక్షలు

అకంప్లీష్డ్​ డాజిల్​- రూ. 10.31 లక్షలు

అకంప్లీష్డ్​ డాజిల్​ ఎస్​- రూ. 10.31 లక్షలు

కామో అకంప్లీష్డ్​ ఏఎంటీ డాజిల్​- రూ. 10.46 లక్షలు

అకంప్లీష్డ్​ ఏఎంటీ- రూ. 10.54 లక్షలు

అకంప్లీష్డ్​ ఎస్​ ఏఎంటీ- రూ. 10.54 లక్షలు

అకంప్లీష్డ్​ సీఎన్​జీ- రూ. 10.54 లక్షలు

క్రియేటివ్​ డీటీ- రూ. 10.95 లక్షలు

క్రియేటివ్​ డీటీ ఎస్​- రూ. 10.95 లక్షలు

Tata Punch SUV : అకంప్లీష్డ్​ ఏఎంటీ డాజిల్​- రూ. 11.01 లక్షలు

అకంప్లీష్డ్​ డాజిల్​ ఎస్​ ఏంటీ- రూ. 11.01 లక్షలు

క్రియేటివ్​ ఏఎంటీ డీటీ- రూ. 11.13 లక్షలు

క్రియేటివ్​ ఫ్లాగ్​షిప్​ డీటీ- రూ. 11.31 లక్షలు

అకంప్లీష్డ్​ డాజిల్​ ఎస్​ సీఎన్​జీ- రూ. 11.52 లక్షలు

క్రియేటివ్​ ఎస్​ ఏఎంటీ డీటీ- రూ. 11.66 లక్షలు

క్రియేటివ్​ ఫ్లాగ్​షిప్​ ఏఎంటీ డీటీ- రూ. 12.42 లక్షలు

Tata Punch on road price : సీఎన్​జీ అని చెప్పినవి మినహాయిస్తే.. మిగిలినవి అన్ని పెట్రోల్​ వేరియంట్లే. టాటా పంచ్​ ఎస్​యూవీలో డీజిల్​ వేరియంట్లు ఏవీ లేవు. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ను సందర్శించాల్సి ఉంటుంది.

సాధారణంగా.. ఏ వెహికిల్​ని లాంచ్​ చేసినా.. ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కానీ రోడ్డు మీదకు వచ్చేసరికి రేటు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్​లో ఉన్న రేటు, ముంబైలో ఉండదు. ముంబైలో ఉన్న రేటు బెంగళూరులో ఉండదు. అందుకే.. ఏదైనా కారు కొనే ముందు దాని ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ని కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకు తగ్గట్టుగానే ప్లాన్​ చేసుకోవాలి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​..

Tata Punch EV on road price : టాటా పంచ్​ ఈవీని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. దీనికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక.. త్వరలోనే టాటా పంచ్​ ఎస్​యూవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా రాబోతోందని టాక్​ నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2025లో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ అవుతుందని సమాచారం.

టాటా పంచ్​ ఈవీని.. 2021 అక్టోబర్​లో లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. అప్పటి నుంచి సేల్స్​ పరంగా ఈ ఎస్​యూవీ దూసుకెళుతోంది. ఇప్పటికే 3లక్షల సేల్స్​ మైలురాయిని దాటేసింది!

తదుపరి వ్యాసం