HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Curvv Ev: లాంచ్ కు ముందే లీకైన టాటా కర్వ్ ఈవీ ఫీచర్లు; ఇవే ఆ స్పెషాలిటీస్..

Tata Curvv EV: లాంచ్ కు ముందే లీకైన టాటా కర్వ్ ఈవీ ఫీచర్లు; ఇవే ఆ స్పెషాలిటీస్..

HT Telugu Desk HT Telugu

27 July 2024, 19:13 IST

  • Tata Curvv EV: టాటా మోటార్స్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది టాటా కర్వ్ ఈవీ లాంచ్ గురించి.. ఈ ఎలక్ట్రిక్ కార్ అందించే స్పెషల్ ఫీచర్స్ గురించి. టాటా కర్వ్ ఈవీ ని ఆగస్ట్ 7న లాంచ్ చేస్తున్నారు. తాజాగా, లాంచ్ కు ముందే టాటా కర్వ్ ఈవీ తో రానున్న స్పెషల్ ఫీచర్స్ కొన్ని లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం..

ఆగస్ట్ 7న టాటా కర్వ్ ఈవీ లాంచ్

ఆగస్ట్ 7న టాటా కర్వ్ ఈవీ లాంచ్

Tata Curvv EV: టాటా మోటార్స్ ఆగస్టు 7 న భారత మార్కెట్లో కొత్త కర్వ్ ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సో, అధికారికంగా, టాటా కర్వ్ ఈవీ లోని ఫీచర్స్ తెలియాలంటే ఆగస్ట్ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే, ముందే ఈ ప్రతిష్టాత్మక ఈవీలో ఉండనున్న ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. ఇప్పుడు, కర్వ్వ్ బ్రోచర్ ఆన్లైన్లో లీకైంది. ఇందులో టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారులో ఉండనున్న ఫీచర్లను వెల్లడిస్తుంది.

టాటా కర్వ్ ఈవీ ఎక్స్టీరియర్ ఫీచర్లు

ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, టాటా కర్వ్ ఈవీ లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరో ఇన్ సర్టర్స్ ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ బూట్ కింద విశాలమైన స్టోరేజ్ ఉంటాయి. ఇందులో ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది.

టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్ ఫీచర్లు

టాటా కర్వ్ ఈవీ లో హర్మన్ నుంచి 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్లు, గెస్చర్ యాక్టివేషన్ తో పవర్డ్ టెయిల్ గేట్ ను అమర్చారు. వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ మరియు వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీని కూడా ఈ కర్వ్ ఈవీలో టాటా అందిస్తోంది.

ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్

అలాగే, టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) లో వెంటిలేటెడ్ సీట్లు, 6-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కో-డ్రైవర్ సీటు ఉంటాయి. వెనుక సీటులో సెంటర్ కన్సోల్ తో పాటు టూ స్టెప్ రెక్లైన్ ఫంక్షన్ ఉంటుంది. ఇందులో ప్యాడల్ షిఫ్టర్లను కూడా టాటా అందిస్తుంది. లెవల్ 2 ఏడీఏఎస్, డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్ తో కూడిన ఈఎస్ పీ, 6 ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టీజర్ లో చెప్పిన ఫీచర్స్

ఇప్పటికే టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) లో ఉండబోయే పలు ఫీచర్లను టీజర్లలో టాటా మోటార్స్ వెల్లడించింది. వాటిలో డ్రైవర్ కోసం డిజిటల్ టీఎఫ్టీ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ మోడల్స్ కూడా..

కర్వ్ ఐసీఈ ఆధారిత వెర్షన్ ను కూడా టాటా మోటార్స్ (tata motors) విడుదల చేయనుంది. కర్వ్ ఈవీ తర్వాత లాంచ్ కానున్న ఈ మోడల్ నేరుగా సిట్రోయెన్ బసాల్ట్ తో పాటు ఇతర కాంపాక్ట్ ఎస్ యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఐసీఈ ఆధారిత కర్వ్ రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనున్నాయి.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్