Tata Curvv EV : అదిరిపోయేలా టాటా కర్వ్​ ఈవీ.. ఫస్ట్​ టీజర్​ వచ్చేసింది- లాంచ్​ ఎప్పుడంటే..-first tata curvv ev teaser dropped ahead of launch this festive season ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Curvv Ev : అదిరిపోయేలా టాటా కర్వ్​ ఈవీ.. ఫస్ట్​ టీజర్​ వచ్చేసింది- లాంచ్​ ఎప్పుడంటే..

Tata Curvv EV : అదిరిపోయేలా టాటా కర్వ్​ ఈవీ.. ఫస్ట్​ టీజర్​ వచ్చేసింది- లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

టాటా కర్వ్ ఈవీకి సంబంధించిన మొదటి టీజర్​ని సంస్థ రివీల్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త కూపే ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా కర్వ్​ ఈవీ టీజర్​

ఎప్పుడెప్పుడు లాంచ్​ అవుతుందా అని ఎదురుచూస్తున్న టాటా కర్వ్​ ఈవీపై కీలక అప్డేట్​ ఇచ్చింది టాటా మోటార్స్​ సంస్థ. ఈ ఎలక్ట్రిక్​ కూపే ఎస్​యూవీకి సంబంధించిన మొదటి టీజర్​ని రివీల్​ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై అంచనాలు మరింత పెరిగాయి. కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్​లో కొత్త డిజైన్ ట్రెండ్​గా భావిస్తున్న ఈ టాటా కర్వ్​ ఈవీ కూపే సిల్హౌట్​ను టీజర్ వీడియో చూపిస్తుంది. ఈ మోడల్​ లాంచ్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్​యూవీ..

టాటా కర్వ్ ఈవీని మొదటిసారిగా 2022 లో కాన్సెప్ట్​ మోడల్​గా ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక తాజాగా లాంచ్​ అయిన టీజర్​ని చూస్తుంటే కాన్సెప్ట్​ వర్షెన్​లోని చాలా భాగాలు ప్రొడక్షన్ వెర్షన్​లో కూడా కనిపిస్తాయని స్పష్టమవుతోంది.

ఈ ఈవీలో కనెక్టెడ్ ఎల్​ఈడీ టెయిల్ లైట్లను టీజర్​లో ఆవిష్కరించగా, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్​ను కాన్సెప్ట్​లో ఇప్పటిక ఉంది. కొత్త టాటా కర్వ్ ఈవీ సరికొత్త యాక్టి-ఈవీ ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించింది సంస్థ. టాటా పంచ్ ఈవీ కొత్త ప్లాట్​ఫామ్​పై ఆధారపడిన మొదటి మోడల్. నెక్సాన్ ఈవీలో చూసినట్లుగా స్టార్టప్ సీక్వెన్స్ కోసం యానిమేటెడ్ లైట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

టాటా కర్వ్ ఈవీ ఫీచర్లు..

టాటా కర్వ్​.. తొలుత ఈవీగా బయటకు వస్తుంది. అనంతరం ఐసీఈ ఇంజిన్​తో కూడిన మోడల్​ లాంచ్​ అవుతుంది. సాధారణంగా.. ఎప్పుడు ఐసీఈ మోడల్​ని తొలుత లాంచ్​ చేస్తుంది టాటా మోటార్స్​. ఇక ఈ టాటా కర్వ్​ ఈవీ కూపే ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్​రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​తో పాటు 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వీ2ఎల్ కెపాసిటీ, లెవల్ 2 ఏడీఏఎస్ తదితర ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. టాటా కొత్తదనం విలువను పెంచడానికి అనేక కొత్త ఫీచర్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

కొత్త యాక్టి.ఈవీ ఆర్కిటెక్చర్ ఫ్రంట్ వీల్, రియర్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లను సపోర్ట్ చేస్తుంది. మరి కర్వ్ ఈవీలో ఏది వస్తుందో చూడాలి. ఈ మోడల్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో రానుంది. అధిక వేరియంట్లలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల పరిధిని అందించే అవకాశం ఉంది.

టాటా కర్వ్​ ఈవీ కాన్సెప్ట్​ని ఇక్కడ చూడండి..

టాటా కర్వ్ ఈవీ ధర..

మార్కెట్​లో ఉన్న అంచనాల ప్రకారం.. టాటా కర్వ్​ ఈవీ కూపే ఎస్​యూవీ ఈ పండుగ సీజన్​లో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈవీ ధరలు సుమారు రూ .20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కూపే ఎస్​యూవీ ఎంజి జెడ్ఎస్ ఈవీ, బీవైడీ అటో 3, అలాగే హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకీ ఈవీఎక్స్​తో సహా రాబోయే ఆఫర్లతో పోటీపడుతుంది.

సంబంధిత కథనం