Tata Curvv : టాటా కర్వ్, కర్వ్ ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్- ఎప్పుడంటే..
టాటా కర్వ్, టాటా కర్వ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే లాంచ్ డేట్‌ని టాటా మోటార్స్ ఫిక్స్ చేసింది. లాంచ్ డేట్‌తో పాటు వీటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2024 ఆగస్టు 7న టాటా కర్వ్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కర్వ్‌ని టాటా విడుదల చేయనుంది. టాటా మోటార్స్ లైనప్‌లో ఈ కొత్త ఎస్యూవీ కూపే నెక్సాన్- హారియర్ మధ్యలో ఉంటుంది. కర్వ్‌కు ప్రధాన ప్రత్యర్థి రాబోయే సిట్రోయెన్ బసాల్ట్.
టాటా మోటార్స్ తన సోషల్ మీడియా పేజీల్లో కొత్త ఎస్యూవీ కూపే టీజర్లను విడుదల చేస్తోంది. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్ ఉంటుందని, ఇది గేర్‌బాక్స్ మేన్యువల్ కంట్రోల్‌కి ఉపయోగపడుతుందని టీజర్ల ద్వారా స్పష్టమైంది. ఇక ఈవీ వర్షెన్‌లో ఈ ప్యాడిల్ షిఫ్టర్ అనేది బ్రేక్ రీజనరేటివ్ లెవల్ని మార్చడానికి ఉపయోగపడుతుంది.
టాటా కర్వ్, కర్వ్ ఈవీ: ఫీచర్లు..
టాటా కర్వ్‌లో సిటీ, ఎకో, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలో ఉపయోగించే డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఇందులో ఉండనుంది. ఇది కాకుండా కర్వ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఛార్జర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సన్‌రూఫ్ వంటివి ఉంటాయి. ఇందులో ఏడీఏఎస్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
టాటా కర్వ్: స్పెసిఫికేషన్లు..
ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్‌లో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్నే కర్వ్‌లో వాడేందుకు సంస్థ రెడీ అవుతోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. దీని గురించి ఇంకా సమాచారం బయటకు రాలేదు. గేర్ బాక్స్ ఆప్షన్లు 6-స్పీడ్ మేన్వువల్ యూనిట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
టాటా కర్వ్ ఈవీ..
ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ రారాజుగా కొనసాగుతోంది. టాటా కొత్త యాక్టివ్.ఈవీ ప్లాట్ఫామ్, మొదట పంచ్ ఈవీతో పరిచయమైంది. ఇది కర్వ్ ఈవీకి పునాదిగా పనిచేస్తుంది. టాటా కర్వ్ ఈవీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ సుమారు 500 కిలోమీటర్లు. వెహికల్ టు లోడ్ ఫంక్షనాలిటీ, బ్రేక్ రీజనరేషన్, డ్రైవింగ్ మోడ్స్, డీసీ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కర్వ్ ఈవీలో ఉన్నాయి. కర్వ్ ఈవీకి ప్రధాన పోటీదారులు ఎంజీ జెడ్ఎస్ ఈవీ, బీవైడి అటో 3, రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ.
ఈ ఈవీలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లను టీజర్లో ఆవిష్కరించగా, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌ను కాన్సెప్ట్‌లో ఇప్పటిక ఉంది. నెక్సాన్ ఈవీలో చూసినట్లుగా స్టార్టప్ సీక్వెన్స్ కోసం యానిమేటెడ్ లైట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ టాటా కర్వ్ ఈవీ కూపే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్తో పాటు 360 డిగ్రీల కెమెరా, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.
టాటా కర్వ్ ఈవీని మొదటిసారిగా 2022 లో కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక తాజాగా లాంచ్ అయిన టీజర్లని చూస్తుంటే కాన్సెప్ట్ వర్షెన్లోని చాలా భాగాలు ప్రొడక్షన్ వెర్షన్లో కూడా కనిపిస్తాయని స్పష్టమవుతోంది.
సంబంధిత కథనం