Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా వస్తున్న సిట్రోయెన్​ బసాల్ట్​ ఇదే..-citroen basalt fully unveiled ahead of launch will rival tata curvv ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా వస్తున్న సిట్రోయెన్​ బసాల్ట్​ ఇదే..

Citroen Basalt : టాటా కర్వ్​కి పోటీగా వస్తున్న సిట్రోయెన్​ బసాల్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Jul 26, 2024 05:34 AM IST

Citroen Basalt launch date : సిట్రోయెన్​ బసాల్ట్​ ఎస్​యూవీ కూపేని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. టాటా కర్వ్​కి పోటీగా వస్తున్న ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇదిగో సిట్రోయెన్​ బసాల్ట్​ ఎస్​యూవీ కూపే..
ఇదిగో సిట్రోయెన్​ బసాల్ట్​ ఎస్​యూవీ కూపే..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో కొత్త సెగ్మెంట్​ పుట్టుకొస్తోంది! అదే.. ఎస్​యూవీ కూపే.  టాటా మోటార్స్​ నుంచి టాటా కర్వ్​ ఎస్​యూవీ కూపే వచ్చే నెలలో లాంచ్​కు రెడీ అవుతోంది. ఇక కర్వ్​కు పోటీగా సిట్రోయెన్​ సంస్థ నుంచి ఒక కొత్త ఎస్​యూవీ కూపే రెడీ అవుతోంది. దాని పేరు సిట్రోయెన్​ బసాల్ట్​. ఈ మోడల్​ని పూర్థిస్థాయిలో సంస్థ తాజాగా ఆవిష్కరించింది.  బసాల్ట్, కర్వ్​లు భారతదేశంలో అత్యంత సరసమైన ఎస్​యూవీ కూపేగా నిలిచిపోనున్నాయి. కొన్ని డీలర్​షిప్​లు ఇప్పటికే బసాల్ట్ కోసం బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో బసాల్ట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

బసాల్ట్​ ఎస్​యూవీ కూపే..

ఈ సిట్రోయెన్​ బసాల్ట్​ రూఫ్​లైన్​ ట్రంక్ లిడ్​ వరకు విస్తరించి ఉంది. ఫెండర్ ఫ్లేర్స్​, ప్లాస్టిక్ క్లాడింగ్ ఉన్నాయి. ఈ హెడ్​ల్యాంప్​లు సీ3 ఎయిర్​క్రాస్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ముందు భాగంలో చంకీ బంపర్, వెనుక భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్​తో పాటు కొత్త టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇరువైపులా, కొత్త అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి.

సిట్రోయెన్ డిజైన్ హెడ్ పియరీ లెక్లెర్క్ మాట్లాడుతూ.. “న్యూ సిట్రోయెన్ బసాల్ట్ ఒక కొత్త రకం సిల్హౌట్. ఇది భారతదేశంలో సీ3, సీ3 ఎయిర్​క్రాస్​లకు అనుబంధంగా ఉంటుంది. ఇది రెండు ప్రపంచాలలో ఉత్తమమైన వాటిని తీసుకువస్తుంది. అవి.. ఎస్​యూవీ దృఢత్వం, కూపే ఎఫీషియెన్సీ, సామర్థ్యం. బసాల్ట్ నిష్పత్తులు ఎస్​యూవీ కోడ్​ల బలాన్ని, దాని ఫెండర్​లు, క్లాడింగ్ లతో మిళితం చేస్తాయి. అయితే దాని ఫాస్ట్ బ్యాక్ సిల్హౌట్ కూపే స్టైలింగ్​ తెస్తుంది,” అని అన్నారు.

సిట్రోయెన్ బసాల్ట్: ఫీచర్లు..

తాజా అధికారిక ప్రివ్యూలు సిట్రోయెన్ బసాల్ట్ ఎస్​యూవీ కూపే లోడెడ్ ఇంటీరియర్​ను కలిగి ఉంటుందని ధృవీకరించాయి. వైబ్రెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కప్ హోల్డర్లతో నిండిన ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్​రెస్ట్​, అలాగే వెనుక భాగంలో ఉన్న ఫోన్ హోల్డర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, వైర్లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.

సిట్రోయెన్ బసాల్ట్: ఇంజిన్ వివరాలు..

సిట్రోయెన్ బసాల్ట్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 109 బీహెచ్​పీ పవర్​, 205 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

టాటా కర్వ్​ ఆగస్ట్​లో లాంచ్​కు రెడీ అవుతోంది. ఇక ఈ సిట్రోయెన్​ బసాల్ట్​ లాంచ్​పై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఎస్​యూవీ కూపే ధరకు సంబంధించిన వివరాలపైనా ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బసాల్ట్​ని సిట్రోయెన్​ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. దీనితో సంస్థ సేల్స్​ పెంచుకోవాలని ప్లాన్​ చేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం