తెలుగు న్యూస్ / ఫోటో /
Citroen Basalt: త్వరలో భారతీయ మార్కెట్లో అడుగు పెట్టనున్న సిట్రోయెన్ బసాల్ట్; ఇది అత్యంత చవకైన ఎస్ యూ వీ కూపే
- Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ లో 1.2-లీటర్ టర్బోఛార్జ్ డ్ ఇంజన్ ఉంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. త్వరలో ఈ మోడల్ ను భారతీయ మార్కెట్లో సిట్రియోన్ విడుదల చేయనుంది.

(1 / 4)
సిట్రోయెన్ తమ సీ-క్యూబ్ ప్రోగ్రామ్ కింద మూడవ వాహనాన్ని ఆవిష్కరించింది. బసాల్ట్ గా పిలిచే ఈ కారు 2024 ద్వితీయార్థంలో మార్కెట్లోకి రానుంది. సీ3, సీ3 ఎయిర్ క్రాస్ లు కూడా సీ-క్యూబ్ ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రపంచ మార్కెట్ల కోసం సరసమైన, సమర్థవంతమైన వాహనాలను తయారు చేయడమే ఈ సీ క్యూబ్ కార్యక్రమం యొక్క లక్ష్యం.
(2 / 4)
సిట్రోయెన్ బసాల్ట్ ను మొదట భారతదేశంలో, ఆ తరువాత దక్షిణ అమెరికాలో లాంచ్ చేయాలని నిర్ణయించారు. బసాల్ట్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎస్ యూవీ కూపే అవుతుంది. భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న మరో ఎస్ యూవీ కూపే టాటా కర్వ్.
(3 / 4)
బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్ ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.
ఇతర గ్యాలరీలు