Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 560 బ్రేకౌట్ స్టాక్‌పై ఫోకస్ చేయండి!
07 October 2024, 7:41 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్ టుడే..
ఇజ్రాయల్- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు, చైనా మార్కెట్లో కొనుగోళ్లు జోరు కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ కరెక్షన్‌కి గురయ్యాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 809 పాయింట్లు పడి 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 235 పాయింట్లు కోల్పోయి 25,015 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 51,462 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9896.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8905.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్ మొదటి వారంలో ఎఫ్ఐఐలు ఏకంగా రూ. 30719.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26428.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
జాబ్స్ డేటా సానుకూలంగా రావడంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.81శాతం పెరిగి రికార్డు స్థాయిలో క్లోజ్ అయ్యింది. ఎస్ అండ్ పీ 500 0.90శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.22శాతం వృద్ధి చెందింది.
ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్- బై రూ. 5332.8, స్టాప్ లాస్ రూ. 5145.38, టార్గెట్ రూ. 5705
ఇన్పో ఎడ్జ్ (నౌకరీ) లిమిటెడ్- బై రూ. 8198.65, స్టాప్ లాస్ రూ. 7900, టార్గెట్ రూ. 8666
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- బై రూ. 2770, స్టాప్ లాస్ రూ. 2720, టార్గెట్ రూ. 2850
అరబిందో ఫార్మా లిమిటెడ్- బై రూ. 1460, స్టాప్ లాస్ రూ. 1430, టార్గెట్ రూ. 1520
పిరామల్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 1032, స్టాప్ లాస్ రూ. 1010, టార్గెట్ రూ. 1080
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో: రూ.757 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.807, స్టాప్ లాస్ రూ.730;
క్విక్ హీల్ టెక్నాలజీస్: రూ.685 వద్ద కొనండి, టార్గెట్ రూ.725, స్టాప్ లాస్ రూ.660;
వీఐపీ ఇండస్ట్రీస్: రూ.564.15, టార్గెట్ రూ.595, స్టాప్ లాస్ రూ.544;
ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్: రూ.506.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.533, స్టాప్ లాస్ రూ.487; మరియు
కేర్ రేటింగ్: రూ .1096.25 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .1150, స్టాప్ లాస్ రూ .1060.