Stocks to buy : స్టాక్ మార్కెట్లో మాంద్యం భయాలు- కానీ ఈ రూ. 91 షేరు మీ దగ్గర ఉంటే భారీ లాభాలు!
05 August 2024, 8:15 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై..
Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 886 పాయింట్లు పడి 80,982 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 293 పాయింట్లు కోల్పోయి 24,718 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 51,350 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న వేళ నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది. కానీ సమీప భవిష్యత్తులో అప్‌ట్రెండ్ కనిపించొచ్చు. నిఫ్టీ 24,600- 24,500 లెవల్స్ పడితే మరింత నెగిటివ్ ట్రెండ్ కనిపించొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3310 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2965.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1220.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 2628.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 360 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Top Stocks : ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే లక్షాధికారులే.. అత్యధిక ధర కలిగిన 5 స్టాక్స్
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు శుక్రవారం నుంచి కుప్పకూలుతున్నాయి. ఇందుకు ఆర్థిక మాంద్యం భయాలే కారణం. ఇక ఏషియా మార్కెట్లు సోమవారం కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కై ఏకంగా 5.6శాతం పడింది. సౌత్ కొరియా కాస్పీ 4.5శాతం పడిపోయింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. డౌ జోన్స్ 1.5శాతం, ఎస్ అండ్ పీ 500 1.84శాతం, నాస్డాక్ ఏకంగా 2.43శాతం పతనమయ్యాయి.
ఇంటెల్ షేర్లు 26శాతం పడిపోవడం గమనార్హం. అమెజాన్ షేర్లు ఏకంగా 8.79శాతం కరెక్ట్ అయ్యాయి.
స్టాక్స్ టు బై..
హెచ్ఎస్సీఎల్: రూ.467.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.493, స్టాప్ లాస్ రూ.457;
సోనాకామ్స్: రూ.689.20 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.725, స్టాప్ లాస్ రూ.675; మరియు
అలెంబిక్: రూ .147 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .154, స్టాప్ లాస్ రూ .143.
బ్రేకౌట్ స్టాక్స్..
ఎస్‌జేఎస్: రూ.984 వద్ద కొనండి, టార్గెట్ రూ.1030, స్టాప్ లాస్ రూ.945
జీహెచ్సీఎల్: రూ.630 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.660, స్టాప్ లాస్ రూ.608
ఖైతాన్ కెమికల్స్: రూ.91.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.96, స్టాప్ లాస్ రూ.88
రూబీ మిల్స్: రూబీ మిల్స్: రూ.262.40 వద్ద కొనండి, టార్గెట్ రూ.275, స్టాప్ లాస్ రూ.252
పోకర్ణ: రూ .771 వద్ద కొనండి, టార్గెట్ రూ .805, స్టాప్ లాస్ రూ .745