HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News : స్టాక్​ మార్కెట్​లో ఎగ్జిట్​ పోల్స్​ జోరు.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

Stock market news : స్టాక్​ మార్కెట్​లో ఎగ్జిట్​ పోల్స్​ జోరు.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

Sharath Chitturi HT Telugu

03 June 2024, 9:30 IST

    • Stock market today : ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడం అనివార్యం అని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చిచెప్పడంతో స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ఉన్నాయి.
స్టాక్​ మార్కెట్​ న్యూస్​ టుడే..
స్టాక్​ మార్కెట్​ న్యూస్​ టుడే..

స్టాక్​ మార్కెట్​ న్యూస్​ టుడే..

Stock market news today : 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చిచెప్పడంతో దేశీయ స్టాక్​ మార్కెట్​లో అత్యంత సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​, నిఫ్టీలు.. కనీవినీ ఎరుగని రీతిలో లాభాల్లో ఓపెన్​ అయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 2,622​ పాయింట్ల లాభంతో 76,583 వద్ద ఓపెన్​ అయ్యింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 807 పాయింట్లు పెరిగి 23,338 వద్ద ఉంది. ఇక 1906 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 50,890 వద్ద ఓపెన్​ అయ్యింది.

ఓపెనింగ్​లో ఈ రెంజ్​లో సూచీలు లాభాలు చూడటం చాాలా అరుదైన విషయం. పైగా.. ఇండెక్స్​లన్నీ ఆల్​-టైమ్​ హై నెంబర్లు కావడం విశేషం.

స్టాక్​ మార్కెట్​లో ఎగ్జిట్​ పోల్స్​ జోరు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎన్నికల ఫీవర్​ గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. తొలినాళ్లల్లో మోదీ ప్రభుత్వం మూడోసారి రావడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ మధ్యలో.. పలు నివేదికలు షాక్​ ఇచ్చాయి. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవచ్చని నివేదికలు బయటకు రావడంతో.. కేంద్రంలో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఉండదని అంచనాలు పెరిగాయి. ఇది స్టాక్​ మార్కెట్​లకు నెగిటివ్​! అందుకే.. కొన్ని వారాల పాటు నిఫ్టీ, సెన్సెక్స్​, బ్యాంక్​ నిఫ్టీల్లో తీవ్ర ఒడుగొడుకులు కనిపించాయి.

Lok Sabha election exit polls 2024 : కానీ.. 2024 లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ అనంతరం శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​.. స్టాక్​ మార్కెట్​ జోరుకు కారణమయ్యాయి. మూడోసారి మోదీ రాక అనివార్యం అని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టంగా చెప్పాయి. ఎగ్జిట్​ పోల్స్​పై నమ్మకం పెట్టిన మదుపర్లకు ఇది గొప్ప పాజిటివ్​ ఎనర్జీ ఇచ్చింది. ఫలితంగా.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ఓపెన్​ అయ్యాయి.

కాగా.. అసలైన ఎన్నికల ఫలితాలు మంగళవారం, జూన్​ 4న వెలువడనున్నాయి. అందువల్ల మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచిస్తున్నారు. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు తలకిందులైతే.. పోర్ట్​ఫోలియో పతనం అయ్యే అవకాశం ఉందని, అందుకే.. బిగినర్లు కొన్ని రోజుల పాటు స్టాక్​ మార్కెట్​లకు దూరంగా ఉండి, గమనించాలని అంటున్నారు. కానీ.. ఎగ్జిట్​ పోల్స్​ 2024 అంచనాలను నిజం చేస్తూ.. లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్​డీఏ- బీజేపీ గెలిస్తే.. స్టాక్​ మార్కెట్​లో సానుకూల పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Lok Sabha elections stock market : ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ విషయానికొస్తే.. సెన్సెక్స్​ 30లోని స్టాక్స్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్​ గ్రిడ్​ 6.3శాతం, ఎన్​టీపీసీ 4.9శాతం, ఎం అండ్​ ఎం 4.8శాతం, ఎల్​టీ 4.7శాతం మేర లాభాల్లో ఉన్నాయి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్