Stocks to buy today : స్టాక్ ఆఫ్ ది డే.. ఈ రూ. 515 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
31 July 2024, 8:10 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే లిస్ట్..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 81,455 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 21 పాయింట్లు పెరిగి 24,857 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధిచెంది 51,499 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ50లో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది.
“నిఫ్టీ 24,800 నుంచి 25,000 మధ్య కదలాడి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. 24,200 నుంచి ర్యాలీ అవ్వడంతో బుల్స్ ఊపిరిపీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ధోరణి సానుకూలంగా ఉంది. నిఫ్టీ నిర్ణయాత్మకంగా 24,700 దిగువకు పడిపోయే వరకు బై-ఆన్-డిప్స్ స్ట్రాటజీని అప్లై చేయవచ్చు. ఎగువన 25,000 దాటితే 25,250 వరకు నిఫ్టీ వెళ్లొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5598.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5565.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి:- New Stock : ఈ స్టాక్ లిస్ట్ అయిన వెంటనే ఇన్వెస్టర్లకు 100 శాతం లాభం తెచ్చింది
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8870.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 20119.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మిక్స్డ్ ముగిశాయి. డౌ జోన్స్ 0.5శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం పడింది. నాస్డాక్ 1.28శాతం మేర నష్టపోయింది.
జులై 31 సమావేశం అనంతరం వడ్డీ రేట్లపై ఫెడ్ కీలక ప్రకటన చేయనుంది. దీనిపై స్టాక్ మార్కెట్ వర్గాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి కాకపోయినా, సెప్టెంబర్ నుంచి వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు నేటి సమావేశం అనంతరం ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు.
స్టాక్స్ టు బై..
చంబల్ ఫెర్టిలైజర్స్: బై రూ.516.75 | టార్గెట్ ధర: రూ.560 | స్టాప్ లాస్: రూ.495
వోల్టాస్: బై రూ.1543.95 | టార్గెట్ ధర: రూ.1650 | స్టాప్ లాస్: రూ.1490
గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: బై రూ.400 | టార్గెట్ ధర: రూ.420 | స్టాప్ లాస్: రూ.390
జిందాల్ స్టీల్ పవర్: బై రూ.979 | టార్గెట్ ధర: రూ.1010 | స్టాప్ లాస్: రూ.950
ఫినోలెక్స్ కేబుల్స్: బై రూ.1580 | టార్గెట్ ధర: రూ.1640 | స్టాప్ లాస్: రూ.1530