RBI MPC : వరుసగా 8వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన-rbi keeps key lending rate unchanged at 6 5 percent mpc meeting ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Mpc : వరుసగా 8వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన

RBI MPC : వరుసగా 8వసారి వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్​బీఐ ప్రకటన

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 10:45 AM IST

RBI MPC : వడ్డీ రేట్లను వరుసగా 8వసారి యథాతంగా ఉంచుతున్నట్ట ప్రకటించింది ఆర్​బీఐ. ఈ మేరకు.. మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ తెలిపారు.

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్​బీఐ ప్రకటన
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్​బీఐ ప్రకటన (REUTERS)

RBI interest rates : మొనేటరీ పాలసీ కమిటీ మీటింగ్​ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఓ ప్రకటన చేశారు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్​. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఫలితంగా వరుసగా 8వసారి రెపో రేటును 6.5శాతంగా ఉంచింది ఆర్​బీఐ.

ద్రవ్యోల్బణంపై ఫోకస్​..

ఆర్​బీఐ.. దేశంలోని బ్యాంక్​లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది. అప్పుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దానినే రెపో రేట్​ అంటారు. రెపో రేట్​ పెరిగితే.. అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి.. బ్యాంక్​లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్​లు కూడా వివిధ లోన్​లపై వడ్డీని పెంచుతాయి. ఇది కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. రెపో రేటు తగ్గితే.. ఆర్​బీఐకి బ్యాంక్​లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. ఫలితంగా.. ప్రజలకు బ్యాంక్​లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి.

ఇక రెపో రెట్లు మారకపోవడంతో.. ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్​లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం కనిపించడం లేదు.

RBI MPC meeting June 2024 : గత ఏడాదిన్నర క్రితం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టింది ఆర్​బీఐ. ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయి. మరి వడ్డీ రేట్ల కోతను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఎప్పుడు మొదలుపెడుతుందో చూడాలి.

“గత కొన్నేళ్లల్లో అనేక సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. కానీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచింది. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం నిత్యం అప్రమత్తంగా ఉండాలి. డ్యూరెబుల్​ బేసిస్​ కింద ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ కట్టుబడి ఉంది,” అని శక్తికాంత దాస్​ తెలిపారు.

ఇక ఎఫ్​వై25లో ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉంటుందని ఆర్​బీఐ అంచనా వేసింది. దీర్ఘకాలంలో దీనిని 4శాతానికి తీసుకురావాలన్నది ప్లాన్​.

మొనేటరీ పాలసీ కమిటీ మీటింగ్​లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆరుగురులో నలుగురు ఓటు వేశారని ఆర్​బీఐ గవర్నర్​ స్పష్టం చేశారు.

RBI latest news : ఆర్​బీఐ ఒక్కటే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రపంచ దేశాలు.. ద్రవ్యోల్బణంపై భారీ పోరాటమే చేశాయి. కీలకమైన అమెరికా ఫెడ్​ కూడా.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తోంది.

మరోవైపు భారత దేశ జీడీపీ వృద్ధిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు శక్తికాంత దాస్​. 2024-25 ఆర్థిక ఏడాదిలో వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను 7శాతం నుంచి 7.2శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు.

స్టాక్​ మార్కెట్​లకు జోష్​..

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.. జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్​బీఐ పెంచడంతో స్టాక్​ మార్కెట్​లకు జోష్​ లభించింది. శక్తికాంత దాస్​ ప్రకటనతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 728 పాయింట్లు పెరిగి 75,802 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో 23,046 వద్ద కొనసాగుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం