FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు లభించేది ఇక్కడే..; అత్యధికంగా 8.8 శాతం వరకు..
FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకుల కంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (NFBC) ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఉదాహరణకు, బజాజ్ ఫైనాన్స్ సంవత్సరానికి 8.6 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ 8.8 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. ఈ రెండు ప్రైవేటు సంస్థలు ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి.
FD interest rates: బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను పెంచింది. వివిధ కాల పరిమితులకు లోబడి బజాజ్ ఫైనాన్స్ 7.4 శాతం నుంచి 8.10 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. కాలపరిమితి 12-14 నెలల మధ్య ఉంటే వార్షిక వడ్డీ 7.40 శాతం. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీలకు క్రిసిల్ ఏఏఏ/స్టేబుల్ రేటింగ్ ను ఇచ్చింది. ఎఫ్డీ కాలపరిమితి 15-23 నెలల మధ్య ఉంటే వార్షిక వడ్డీ 7.5 శాతంగా ఉంటుంది. 24-35 నెలల కాలపరిమితికి వార్షిక వడ్డీ 7.8 శాతం, 36 నుంచి 60 నెలల కాలపరిమితికి 8.10 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.
స్పెషల్ పీరియడ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై..
స్పెషల్ పీరియడ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఉదాహరణకు 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. 22 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 7.90 శాతంగా ఉంది. 33 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. 44 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. 42 నెలల కాలపరిమితి ఎఫ్డీని కూడా బజాజ్ ఫైనాన్స్ ప్రారంభించింది. దీనికి వడ్డీ రేటు 8.60 శాతంగా ఉంది. ఈ రేట్లు 2024 ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి.
Tenure (months) | Interest (%) |
12-14 | 7.4 |
15-23 | 7.5 |
24-35 | 7.8 |
36-60 | 8.10 |
42 | 8.6 |
శ్రీరామ్ ఫైనాన్స్: మరో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ అయిన శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance) 12 నుండి 60 నెలల కాలపరిమితికి సంవత్సరానికి 7.85 నుండి 8.80 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు 2024 ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ఎఫ్డీలు ఇక్రా (ICRA) ద్వారా ఎఎ + (స్థిరమైన) రేటింగ్ ను పొందాయి. 50 నెలలు లేదా 60 నెలల డిపాజిట్లకు గరిష్టంగా 8.80 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 42 నెలల కాలపరిమితితో ఉన్న ఎఫ్డీలకు 8.75 శాతం, అలాగే 36 నెలల కాలపరిమితి ఎఫ్డీలకు 8.7 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, 30 నెలల కాలపరిమితి ఎఫ్డీలకు 8.35 శాతం, 18 నెలల కాలపరిమితికి 8% , 12 నెలలకు 7.85 శాతం వడ్డీ రేట్లను శ్రీరామ్ ఫైనాన్స్ అందిస్తోంది.
Tenure (months) | Interest Rate (%) |
12 | 7.85 |
18 | 8 |
24 | 8.15 |
30 | 8.35 |
36 | 8.70 |
42 | 8.75 |
50 | 8.8 |
60 | 8.8 |