Bajaj Finance FD rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బజాజ్​ ఫైనాన్స్​-bajaj finance hikes fd rates for most tenures by up to 60 bps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Finance Fd Rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బజాజ్​ ఫైనాన్స్​

Bajaj Finance FD rates : ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బజాజ్​ ఫైనాన్స్​

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 11:15 AM IST

Bajaj Finance FD : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేద్దామని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే. బజాజ్​ ఫినాన్స్​.. తమ ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఆ వివరాలు..

ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచిన బజాజ్​ ఫైనాన్స్​..
ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచిన బజాజ్​ ఫైనాన్స్​..

Bajaj Finance hikes FD rates : దేశంలో అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీస్​ గ్రూప్​లో ఒకటిగా ఉన్న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. సంస్థలొ భాగమైన బజాజ్ ఫిన్​సర్వ్​లు.. వివిధ కాల పరిమితుల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును పెచుతున్నట్టు ప్రకటించాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంపు..

ఏప్రిల్ 3, 2024 నుంచి.. సీనియర్ సిటిజన్​లకు 25 నుంచి 35 నెలల కాలవ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్​లపై ఇచ్చే వడ్డీ రేటును 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బజాజ్​ ఫిన్​సర్వ్​. 18 నుంచి 24 నెలలు కాల పరిమితి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 40 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచింది.

సీనియర్ సిటిజన్ కాని వారి కోసం 25 నుంచి 35 నెలల కాలపరిమితి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు, 20 నుంచి 35 నెలల కాల వ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు, 30 నుంచి 33 నెలల కాల వ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బజాజ్​ ఫిన్​సర్వ్​.

Fixed deposit interest rates 2024 : ఈ నిర్ణయం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పొదుపుదారులకు స్థిరమైన, మెరుగైన రాబడిని పొందేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

సీనియర్ సిటిజన్లు 8.85% వరకు ఫిక్స్​డ్ డిపాజిట్​ రేట్లను పొందడం కొనసాగించవచ్చు. సీనియర్ సిటిజన్లు కానివారు 42 నెలల వ్యవధి కలిగిన ఫిక్స్​డ్​ డిపాజిట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడం ద్వారా 8.60% గా వడ్డీ రేటు పొందవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్​డ్​ డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ సచిన్ సిక్కా మాట్లాడుతూ.. "మేము పెంచిన వడ్డీ రేట్లు స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్​ని అందిస్తున్నాయి. సంవత్సరాలుగా, మిలియన్ల మంది డిపాజిటర్లు బజాజ్ బ్రాండ్‌పై తమ విశ్వాసాన్ని ఉంచారు. మేము వారికి మెరుగైన అనుభవం మరింత విలువ, వారి పొదుపు కోసం సురక్షితమైన ఎంపికను అందించడంపై దృష్టి సారిస్తూనే ఉన్నాము" అని తెలియజేశారు.

మార్చి 31, 2024 నాటికి బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ ప్రాంచైజీ సుమారు 83.64 ఎంఎంగా ఉంది. 60వేల కోట్లను డిపాజిట్ల రూపంలో స్వీకరించిన ఈ కంపెనీ.. దేశంలోనే అత్యధిక డిపాజిట్లను స్వీకరించిన ఎన్​బీఎఫ్​సీగా అవతరించింది.

Bajaj Finserv FD rates 2024 : డిసెంబర్ 31, 2023 నాటికి 49.19 మిలియన్ల నికర వినియోగదారులు యాప్​ ప్లాట్​ఫార్మ్​ వినియోగదారులుగా ఉన్నారు. డేటా డాట్ ఐఓ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో ఆర్థిక సేవా రంగంలో బజాజ్ ఫిన్​సర్వ్ .యాప్ అనేది.. ప్లే స్టోర్ నుంచి నాలుగొవ అత్యధిక డౌన్​లోడెడ్​ యాప్​గా నిలచింది.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోగ్రామ్​.. క్రిసిల్​ ఏఏఏ/స్టేబుల్, ఐసీఆర్​ఏ ఏఏఏ/స్టేబుల్ తో అత్యధిక స్థిరత్వ రేటింగ్‌లను కలిగిన పెట్టుబడి ఆప్షన్​గా నిలిచింది. పెట్టుబడిదారుల కోసం సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా నిలచింది. ఈ యాప్ వినియోగదారుల కోసం వివిధ పెట్టుబడి మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్మెంట్​ను చేయగల అవకాశాన్ని సైతం కలిగిస్తోంది.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి..

Bajaj Finserve FD rate hike : బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్.. బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ చేసుకున్న ఒక డిపాజిట్-టేకింగ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్​బఎఫ్​సీ-డీ). ఇది ఎన్​బీఎఫ్​సీ-ఇన్వెస్ట్‌మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ-ఐసీసీ) గా వర్గీకరించడం జరిగింది. బీఎఫ్​ఎల్​ రుణాలు ఇవ్వడం, డిపాజిట్ల స్వీకరణ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఇది పట్టణ, గ్రామీణ భారతదేశంలో గణనీయమైన ఉనికిని కలిగిన రిటైల్, ఎస్​ఎంఈలు, వాణిజ్య కస్టమర్‌ల విభిన్న రుణాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇది పబ్లిక్, కార్పొరేట్ డిపాజిట్లను అంగీకరిస్తుంది. వినియోగదారులకు వివిధ రకాల ఆర్థిక సేవల ఉత్పత్తులను అందిస్తుంది. బీఎఫ్​ఎల్​, ముప్పై ఆరేళ్ల సంస్థ. ఇప్పుడు భారతదేశంలోని ఎన్​బీఎఫ్​సీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఏకీకృత ప్రాతిపదికన, ఇది 80.41 మిలియన్ల వినియోగదారుల ఫ్రాంచైజీని కలిగి ఉంది. బీఎఫ్​ఎల్​ దీర్ఘ-కాల రుణం కోసం ఏఏఏ/స్టేబుల్ అత్యధిక దేశీయ క్రెడిట్ రేటింగ్ కలిగి ఉంది. స్వల్పకాలిక రుణం కోసం ఏ1+. ఫిక్స్​డ్ డిపాజిట్ ప్రోగ్రామ్ కోసం క్రిసిల్​ ఏఏఏ/స్టేబుల్ అండ్​ ఐసీఆర్​ఏ/ఏఏఏ(స్టేబుల్) కలిగి ఉంది. ఇది బీబీబీ-/స్టేబుల్ ఏ దీర్ఘకాలిక ఇష్యూవర్​ క్రెడిట్ రేటింగ్ దానితోపాటు ఎస్​ అండ్​ పీ గ్లోబల్ ద్వారా స్వల్పకాలిక ఏ-3 రేటింగ్‌ కలిగి ఉంది.

మరింత సమచారాం తెలుసుకోవడానికి www.bajajfinserv.in ని వెంటనే సందర్శించండి.

WhatsApp channel

సంబంధిత కథనం