Small savings schemes interest : చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చని కేంద్రం..-govt keeps interest rates on small savings schemes unchanged for q1fy25 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Small Savings Schemes Interest : చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చని కేంద్రం..

Small savings schemes interest : చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చని కేంద్రం..

Sharath Chitturi HT Telugu
Mar 09, 2024 06:54 AM IST

చిన్న పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలు..

చిన్న పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీని ప్రభుత్వం యథాతథంగా ఉంచింది.
చిన్న పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీని ప్రభుత్వం యథాతథంగా ఉంచింది.

Small savings schemes : ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి.. వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ఫలితంగా.. 2024 జూన్ 30 వరకు వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

"ఏప్రిల్ 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు ముగిసే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి 1, 2024 నుంచి మార్చి 31, 2024 వరకు) నోటిఫై చేసినట్టుగానే యథాతథంగా ఉంచుతున్నాము," అని నోటిఫికేషన్​లో ఉంది.

ఈ పథకాలు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక విరామాలలో గ్యారెంటీ రిటర్నులు అందిస్తాయి. ఈ సాధనాలు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లకు సేవలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ.. 6-8శాతం మధ్యలో ఉంటాయి.

చిన్న మొత్తాల పొదుపు పథకంపై వడ్డీ రేట్లు..

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ స్కీమ్: ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. జనవరి 1, 2024 నుంచి వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్​పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

PPF interest rate : పీపీఎఫ్: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా నాలుగు శాతంగానే ఉంది.

కిసాన్ వికాస్ పత్ర: ఈ స్కీమ్​లో గరిష్ట పరిమితి లేదు. కనీసం రూ .1,000 పెట్టుబడి పెట్టాలి. వార్షికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుందని, 115 నెలల్లో పెట్టుబడులు మెచ్యూరిటీ అవుతాయి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: ఈ స్కీమ్​లో గరిష్ఠ పరిమితి రూ. 30లక్షలు. కనిష్ఠంగా రూ .1,000 డిపాజిట్ చేయడం ద్వారా ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ): గరిష్ట పరిమితి లేదు. కనీసం రూ .1,000 పెట్టుబడి పెట్టడం ద్వారా ఖాతా తెరవవచ్చు. వడ్డీ రేటు వార్షికంగా 7.7 శాతం ఉంటుంది. కానీ అది మెచ్యూరిటీ సమయంలో చెల్లింస్తారు. ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే, మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్ వడ్డీ రేటు పెట్టుబడిదారులకు 7.4 శాతం లభిస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్: కనీసం రూ.1,000 డిపాజిట్ చేయవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్: ఈ ఖాతాలను కనీసం రూ.1,000 డిపాజిట్ చేయడం ద్వారా తెరవవచ్చు. గరిష్ట పరిమితి లేదు.

1 సంవత్సరం టైమ్ డిపాజిట్: ఈ డిపాజిట్లు 6.9 శాతం చొప్పున వడ్డీని అందిస్తాయి .

2 సంవత్సరాల టైమ్ డిపాజిట్: వడ్డీ రేటు 7 శాతం.

3 సంవత్సరాల టైమ్ డిపాజిట్: వడ్డీ రేటు 7.1 శాతం.

5 సంవత్సరాల టైమ్ డిపాజిట్: అందించే వడ్డీ రేటు 7.5 శాతం.

5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ స్కీమ్: నెలకు రూ .100 లేదా రూ .10 గుణకాల్లో ఏదైనా మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా దీనిని తెరవవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య వార్షికంగా 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.

ప్రధానంగా పోస్టాఫీసులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నోటిఫై చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2022 మే నుంచి బెంచ్​మార్క్​ లెండింగ్ రేటును 2.5 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచాయి. గత ఐదు ద్రవ్యపరపతి విధాన సమావేశాల్లోఆర్​బీఐ పాలసీ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించింది.

Whats_app_banner

సంబంధిత కథనం