Zerodha’s banking stock: జెరోధా పెట్టుబడి పెట్టిన బ్యాంక్ ఏదో తెలుసా?-zerodha picks stake in this banking stock during q3 check the bank s details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zerodha’s Banking Stock: జెరోధా పెట్టుబడి పెట్టిన బ్యాంక్ ఏదో తెలుసా?

Zerodha’s banking stock: జెరోధా పెట్టుబడి పెట్టిన బ్యాంక్ ఏదో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 05:12 PM IST

Zerodha’s banking stock: ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ ఫర్మ్ జెరోధా (Zerodha) ఒక ప్రైవేటు బ్యాంక్ లో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Zerodha’s banking stock: బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా(Zerodha) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఒక ప్రైవేటు బ్యాంక్ లో పెట్టుబడులు పెట్టింది.

yearly horoscope entry point

Zerodha’s banking stock: బ్యాంక్ షేర్లు..

జెరోధా(Zerodha) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంక్ అయిన ఆర్ బీ ఎల్ బ్యాంక్ (RBL Bank)లో భారీగా పెట్టుబడులు పెట్టింది. జనవరి 11, 2023న ఆ బ్యాంక్ (RBL Bank) షేర్ ధర సుమారు రూ. 180 గా ఉంది. గత సంవత్సర కాలంలో ఈ బ్యాంక్ షేర్ ధర 26% పెరిగింది. RBL Bank కు చెందిన 1.26% షేర్లను జెరోధా కొనుగోలు చేసింది. అంటే, 75,53,944 RBL Bankషేర్లును 2022 అక్టోబర్ - డిసెంబర్ మధ్య జెరోధా కొనేసింది. అంతకుముందు, ఆ బ్యాంక్ లో జెరోధాకు ఎలాంటి షేర్లు లేవు. ఆర్ బీ ఎల్ బ్యాంక్ (RBL Bank) కమర్షియల్ బ్యాంకింగ్ తో పాటు, కార్పొరేట్ అండ్ ఇన్ స్టిట్యూషనల్ బ్యాంకింగ్, బ్రాంచ్ అండ్ బిజినెస్ బ్యాంకింగ్, రిటైల్ అస్సెట్స్ అండ్ ట్రెజరీ, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Zerodha’s banking stock: ఆదాయం పెరిగింది

ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలతో ముగిసే రెండో త్రైమాసికంలో (Q2 FY23) బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్ కం (net interest income NII) రూ. 1,064 కోట్లు. ఇది గత సంవత్సరం Q2 తో పోలిస్తే 16% అధికం. బ్యాడ్ లోన్స్ తగ్గడంతో పాటు ఎన్పీఏ రేషియో కూడా మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయని RBL Bank ఎండీ, సీఈఓ ఆర్ సుబ్రమణ్య కుమార్ తెలిపారు. జెరోధా () బ్రోకరేజ్ సంస్థ కార్యకలాపాలు 2010 ఆగస్ట్ లో ప్రారంభమయ్యాయి. ఈ స్టార్టప్ ను నితిన్ కామత్, నిఖిల్ కామత్ లు ప్రారంభించారు.

Whats_app_banner