RBI governor at HTLS 2022: ‘6% దాటిన ద్రవ్యోల్బణం ఆర్థిక అభివృద్ధికి హానికరం’-inflation above 6 can be detrimental to india growth rbi governor at htls 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Inflation Above 6% Can Be Detrimental To India Growth: Rbi Governor At Htls 2022

RBI governor at HTLS 2022: ‘6% దాటిన ద్రవ్యోల్బణం ఆర్థిక అభివృద్ధికి హానికరం’

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 04:39 PM IST

RBI governor at HTLS 2022: దేశ ఆర్థికాభివృద్ధికి ద్రవ్యోల్బణం(inflation) అదుపులో ఉండడం అత్యంత ఆవశ్యకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్ తెలిపారు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్-2022(Hindustan Times Leadership Summit 2022)లో ఆయన పాల్గొన్నారు.

ఆర్బీఐ గవర్నర్ శక్తకాంత దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తకాంత దాస్

RBI governor at HTLS 2022: హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2022 (Hindustan Times Leadership Summit 2022)లో శనివారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణం(inflation) 4% నుంచి 6% మధ్యనే ఉండాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

RBI governor at HTLS 2022: ద్రవ్యోల్బణం(inflation) కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాటన నడవాలంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం అత్యవసరమని ఆర్బీఐ గవర్నర్ దాస్ పేర్కొన్నారు. 6% కన్నా ద్రవ్యోల్బణం పెరిగితే అది దేశ ఆర్థికాభివృద్ధికి అడ్డుగా మారుతుందని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం(inflation) 4% నుంచి 6% మధ్య ఉంటేనే, ఆర్బీఐ ద్రవ్య విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడ్తాయని RBI governor వివరించారు. అక్టోబర్ ద్రవ్యోల్బణ గణాంకాలు 7% లోపే ఉంటాయని ఆశిస్తున్నామన్నారు.

RBI governor at HTLS 2022: ఉక్రెయిన్ యుద్ధంతో..

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అందులో భారత్ కూడా ఒకటని RBI governor దాస్ వివరించారు. ఆ యుద్ధం వల్లనే భారతదేశ ద్రవ్యోల్బణ రేటు 6.3% నుంచి 7.3% మధ్య ఉంటోందన్నారు. ‘ఈ ఫిబ్రవరిలో inflation 4% ఉంటుందని అంచనా వేశాం. బారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు పెరిగినా, ద్రవ్యోల్బణం 6% మించదని భావించాం. కానీ, ఉక్రెయిన్ యుద్ధం మా అంచనాలను దెబ్బ తీసింది. ఒక్క సారిగా inflation అనూహ్యంగా పెరిగింది’ అని RBI governor వివరించారు. అయినా, ఈ ప్రతికూల పరిస్థితులను కూడా భారత్ తట్టుకుందని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉండడం వల్లనే అది సాధ్యమైందని వివరించారు.

WhatsApp channel

టాపిక్