Stocks to buy today : ఈ రూ. 200 స్టాక్‌ని ట్రాక్ చేయండి.. షార్ట్ టర్మ్‌లో లాభాలు పక్కా!
02 April 2024, 8:04 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్ టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు పెరిగి 74,015 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో 22,462 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ.. 457 పాయింట్లు పెరిగి 47,578 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 అప్‌ట్రెండ్‌లో దూసుకెళుతోంది. ‘నిఫ్టీ ప్రస్తుతం 22,500 - 22,550 లెవల్స్ వద్ద కీలక రెసిస్టెన్స్‌ని ఎదుర్కొంటోంది. అది దాటితే.. నిఫ్టీ50 మరింత పైకి వెళ్లొచ్చు. మొత్తం మీద.. నిఫ్టీ ఛార్ట్ పాజిటివ్‌గానే కనిపిస్తోంది,’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 522.3 కోటల్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1208.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 140 పాయింట్ల లాస్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market updates : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.6శాతం, ఎస్ అండ్ పీ 500 0.2శాతం మేర నష్టపోయాయి. టెక్ ఇండెక్స్ నాస్డాక్ మాత్రం 0.11శాతం మేర లాభపడింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : టీసీఎస్:- బై రూ. 3916.75, స్టాప్ లాస్ రూ. 3800, టార్గెట్ రూ. 4150
మెక్‌డోవెల్-ఎన్:- బై రూ. 1158.3, స్టాప్ లాస్ రూ. 1121, టార్గెట్ రూ. 1230
బోరోసిల్ రెనెవెబుల్స్:- బై రూ. 543.5, స్టాప్ లాస్ రూ. 530, టార్గెట్ రూ. 575
పరాగ్ మిల్క్:- బై రూ. 214.5, స్టాప్ లాస్ రూ. 208, టార్గెట్ రూ. 230
అమరరాజ ఎనర్జీ:- బై రూ. 795, స్టాప్ లాస్ రూ. 777, టార్గెట్ రూ. 840
Prestige share price today : ప్రెస్టీజ్:- బై రూ. 1264- రూ. 1267, స్టాప్ లాస్ రూ. 1245, టార్గెట్ రూ. 1300
ఎల్టీ ఫుడ్స్:- బై రూ. 199- రూ. 200, స్టాప్ లాస్ రూ. 194, టార్గెట్ రూ. 212