తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : అప్​ట్రెండ్​లో స్టాక్​ మార్కెట్​- ఈ రూ. 105 స్టాక్​తో భారీ లాభాలు..!

Stocks to buy today : అప్​ట్రెండ్​లో స్టాక్​ మార్కెట్​- ఈ రూ. 105 స్టాక్​తో భారీ లాభాలు..!

Sharath Chitturi HT Telugu

29 July 2024, 8:50 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1293 పాయింట్లు పెరిగి 81,333 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 429 పాయింట్లు పెరిగి 24,835 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 407 పాయింట్లు వృద్ధిచెంది 51,296 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ50 అప్​ట్రెండ్​లో దూసుకెళుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ తర్వాత భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బాగ్డియా తెలిపారు. 50 షేర్ల ఇండెక్స్ ఇప్పుడు 25,000 మార్క్ దిశగా కదులుతోందన్నారు. అయితే, స్టాక్-నిర్దిష్ట విధానాన్ని నమ్మేవారికి, బ్రేక్అవుట్ స్టాక్స్ వైపు చూడాలని ఆయన సూచించారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2546.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2774.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 16943.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 8888.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Ola Electric IPO : ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓపై కీలక అప్డేట్​- ప్రైజ్​ బ్యాండ్​ ఎంతంటే..

స్టాక్​ టు వాచ్​..

అల్ట్రాటెక్​ సిమెంట్​:- మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అతిపెద్ద సిమెంట్ తయారీదారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్​లో 32.72 శాతం కొనుగోలుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆల్ట్రాటెక్​ సిమెంట్​ షేర్లపై ఫోకస్​ ఉండనుంది. స్టాక్​ లాభపడొచ్చని అంచనాలు ఉన్నాయి.

జూలై 26 శుక్రవారం ట్రేడింగ్ సెషన్​లో అల్ట్రాటెక్​ సిమెం్​ షేరు ధర 2.01 శాతం పెరిగి రూ.11679.25 వద్ద ముగిసింది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 1.64శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.11శాతం పెరిగింది. నాస్​డాక్​ 1.03శాతం మేర వృద్ధిచెందింది.

స్టాక్స్​ టు బై..

హెచ్​సీఎల్ టెక్స్ టైల్స్: రూ.105.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.110.90, స్టాప్ లాస్ రూ.101.50;

సీఎస్ఎల్ ఫైనాన్స్: రూ.525 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.550, స్టాప్ లాస్ రూ.505

బాంకో ప్రొడక్ట్స్ ఇండియా: రూ.768 వద్ద కొనండి, టార్గెట్ రూ.805, స్టాప్ లాస్ రూ.740

ఏడబ్ల్యూహెచ్​సీఎల్: రూ.890 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.935, స్టాప్ లాస్ రూ.855;

ఈఎంఎస్ లిమిటెడ్: రూ .843 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .888, స్టాప్ లాస్ రూ .815

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం