Stock market holidays : ఆగస్ట్‌లో స్టాక్ మార్కెట్లకు ఎన్ని రోజులు సెలవు? ఇదిగో లిస్ట్..
Stock market holidays in August : ఆగస్ట్ నెలకు సంబంధించిన స్టాక్ మార్కెట్ సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోంది. లిస్ట్ చూసిన అనంతరం ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ ప్లాన్స్‌ని రూపొందించుకోవచ్చు.
ఇంకొన్ని రోజుల్లో జులై నెల ముగియనుంది. ఇక 2024 ఆగస్టులో వారాంతాలతో సహా మొత్తం 10 రోజుల పాటు భారత స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు ఆగస్టు నెలలో 10 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి . ఆగస్టుకు సంబంధించిన స్టాక్ మార్కెట్ సెలవుల గురించి తెలుసుకుని పెట్టుబడిదారులు మరియు ట్రేడర్లు తదనుగుణంగా తమ ఇన్వెస్ట్మెంట్స్/ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆగస్ట్ నెలలో స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి..
ఆగస్ట్‌లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా:
ఆగస్టు 3, 2024: శనివారం (వీకెండ్)
ఆగస్టు 4, 2024: ఆదివారం (వీకెండ్)
ఆగస్టు 10, 2024: శనివారం (వీకెండ్)
ఆగస్టు 11, 2024: ఆదివారం (వీకెండ్)
ఆగస్టు 15, 2024: గురువారం (ఇండిపెండెన్స్ డే - నేషనల్ హాలిడే)
ఆగస్టు 17, 2024: శనివారం (వీకెండ్)
ఆగస్టు 18, 2024: శనివారం (వీకెండ్)
ఆగస్టు 18, 2024: ఆదివారం (వీకెండ్)
ఆగస్టు 24, 2024: శనివారం (వీకెండ్)
ఆగస్టు 25, 2024: ఆదివారం (వీకెండ్)
ఆగస్టు 31, 2024: శనివారం (వీకెండ్)
ఇక శని, ఆదివారాలు కాకుండా జులై నెలలో స్టాక్ మార్కెట్లకు అదనంగా ఒక రోజు సెలవు లభించింది. మొహర్రం నాడు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంది.
ఇండియా స్టాక్ మార్కెట్..
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ ఇండెక్స్ 1.62 శాతం పెరిగి 81,332.72 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 1.76 శాతం పెరిగి 24,834.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ 2.24 శాతం పెరిగి 16,296.30 పాయింట్ల వద్ద, 2.17 శాతం లాభంతో 12,687 పాయింట్ల వద్ద టాప్ మూవర్స్ గా నిలిచాయి.
సెన్సెక్స్‌లోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లో ఆరు కంపెనీలgn మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) గత వారం రూ.1,85,186.51 కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఇన్ఫోసిస్ (ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్) అత్యధికంగా లాభపడ్డాయి. గత వారంలో 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 728.07 పాయింట్లు అంటే 0.90 శాతం పెరిగింది.
జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కనిపించనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ, అకుమ్స్ డ్రగ్ ఐపీఓ కొత్త ఇష్యూతో పాటు మరో రెండు కంపెనీల లిస్టింగ్స్ జరగనున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) వెబ్‌సైట్‌లోని కంపెనీ ఫైలింగ్ ప్రకారం, ఇండియా సిమెంట్స్‌లో 32.72 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అల్ట్రాటెక్ సిమెంట్‌కు అనుమతి లభించింది. ఇండియా సిమెంట్స్‌లో 32.72 శాతం వాటాను ప్రమోటర్లు, వారి అసోసియేట్ల నుంచి కొనుగోలు చేయడానికి అల్ట్రాటెక్ ఒక్కో షేరుకు రూ.390 చొప్పున రూ.3,954 కోట్లు చెల్లించనుంది.
సంబంధిత కథనం