మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకోసమే ఈ న్యూస్-ganesh green bharat ipo if you want to invest in share market then this news is for you ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకోసమే ఈ న్యూస్

మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకోసమే ఈ న్యూస్

Anand Sai HT Telugu
Jul 02, 2024 04:30 PM IST

Ganesh Green Bharat : మీరు ఐపీఓలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే మీకోసం ఒక్క న్యూస్ ఉంది. కాస్త ఆలోచించి అడుగు వేస్తే మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది.

ఐపీఓకు గణేష్ గ్రీన్ భారత్
ఐపీఓకు గణేష్ గ్రీన్ భారత్

చాలా మంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంటారు. అయితే ఐపీఓకు వచ్చిన వాటిలో దేనిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచనల్లో పడతారు. ఒకవేళ కొనాలి అని చూసినా అధిక ధరలు ఉంటాయి. అయితే మీరు ఐపీఓలో డబ్బులు పెట్టాలని చూస్తే.. మీకోసం ఓ వార్త ఉంది.

మీరు ఐపీఓలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే వచ్చే వారం నుంచి పెట్టుబడుల కోసం మరో కంపెనీ ఐపీఓకు వస్తుంది. ఈ ఐపీఓ గణేష్ గ్రీన్ భారత్ కు చెందినది. గణేష్ గ్రీన్ ఇండియా ఐపీఓ జూలై 5 నుంచి ప్రారంభం కానుంది. జూలై 9 వరకు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని ధరను రూ.190గా నిర్ణయించారు.

గణేశ్ గ్రీన్ భారత్ ఐపీఓ గ్రే మార్కెట్లో రూ.180 ప్రీమియంతో అందుబాటులో ఉంది. అంటే కంపెనీ షేరు ధర రూ.190 నుంచి రూ.370 వద్ద లిస్ట్ కావొచ్చు. అంటే కంపెనీ షేర్లు 95 శాతం ప్రీమియంతో లిస్ట్ అవుతాయి.

సౌభాగ్య యోజన, కుసుమ్ యోజన, సౌర్ సుజల యోజన వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ సంస్థ ప్రాజెక్టులను అమలు చేసింది. గణేష్ గ్రీన్ భారత్ సోలార్, ఎలక్ట్రికల్ వస్తువుల సరఫరా, ఇన్ స్టలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ లో అనేక సేవలను అందిస్తుంది.

కంపెనీ వ్యాపారాలు

సౌర వ్యవస్థలు, అనుబంధ సేవలు

ఎలక్ట్రికల్ ఆర్డర్ సేవలు

నీటి సరఫరా పథకం ప్రాజెక్టులు, సోలార్ ఫోటోవోల్టాయిక్(పివి) మాడ్యూల్స్ తయారీ వంటి బహుళ రంగాలలో విస్తరించి ఉంది.

అంతేకాదు దీని అనుబంధ సంస్థ అయిన సౌరజ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 192.72 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) మాడ్యూల్స్ తయారీలో నిమగ్నమైంది. మార్చి 2024 నాటికి, కంపెనీ సోలార్ సిస్టమ్స్ కోసం 17 వర్క్ ఆర్డర్లు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ సేవలకు 7 వర్క్ ఆర్డర్లు, నీటి సరఫరా పథకాల కోసం 2 వర్క్ ఆర్డర్లను పూర్తి చేసింది. అయితే ఇది కొత్తగా ఐపీఓకు రావడంతో కొంతమంది దీనిపై ఇంట్రస్ట్ చూపిస్తు్న్నారు.

గమనిక : స్టాక్ మార్కెట్‍‌లో ఏదైనా షేర్లను కొనాలి అనుకుంటే నిపుణులను సంప్రదించండి. మేం కేవలం సమాచారం కోసం మాత్రమే ఈ కథన ఇచ్చాం.

WhatsApp channel