HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 320 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలు!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 320 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలు!

Sharath Chitturi HT Telugu

23 September 2024, 8:55 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1360 పాయింట్లు పెరిగి 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 375 పాయింట్లు పెరిగి 25,791 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 756 పాయింట్లు పెరిగి 53,793 వద్దకు చేరింది.

“26000 వద్ద ఉన్న రైజింగ్​ ఛానెల్​ అప్పర్​ ఎండ్​కి నిఫ్టీ50 కదులుతోందని డైలీ ఛార్ట్​ చూస్తే స్పష్టమవుతోంది. నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ టార్గెట్​ 26000. 25,500- 25,450 సపోర్ట్​గా ఉంది,” అని షేర్​ఖాన్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ జతిన్​ గేడియా అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 14064.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4427.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 33,700 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,249.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Stock market investment : రూ. 700 నుంచి రూ. 2కి పడిపోయిన స్టాక్​- ఇన్​వెస్టర్స్​కి భారీ నష్టాలు..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.09శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.19శాతం వృద్ధి పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.36 శాతం నష్టపోయింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి. జపాన్​ మార్కెట్​లకు నేడు సెలవు.

స్టాక్స్​ టు బై..

హావెల్స్ ఇండియా లిమిటెడ్: రూ.2,048కే కొనొచ్చు. టార్గెట్​ రూ.2,150 రూ.2,000 వద్ద స్టాప్ లాస్

సెంచురీ ప్లైబోర్డ్స్ (ఐ) లిమిటెడ్ (సెంచురీప్లై): రూ.895కు కొనండి. టార్గెట్​ 940; స్టాప్ లాస్ రూ.870

ఇండిజీన్ లిమిటెడ్ (ఐఎన్ డీజీఎన్): రూ.662 వద్ద కొనండి. రూ.700 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.648

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

మార్కాన్స్ ఫార్మా: రూ.318.35 వద్ద కొనుగోళ్లు, టార్గెట్ రూ.336, రూ.307 స్టాప్​ లాస్​.

కాంకార్డ్ బయోటెక్: రూ.2601.10 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ.2750, స్టాప్ లాస్ రూ.2515;

మగధ షుగర్: రూ.957.45, టార్గెట్ రూ.1010, స్టాప్ లాస్ రూ.920;

ప్రిజం జాన్సన్: రూ.219.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.233, స్టాప్ లాస్ రూ.211;

రిలయన్స్ ఇన్ఫ్రా: రూ.316.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.335, స్టాప్ లాస్ రూ.305.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్