Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఈ రూ. 78 స్టాక్‌తో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్!
23 August 2024, 8:50 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు పెరిగి 81,053 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు పెరిగి 24,811 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు వృద్ధి చెంది 50,986 వద్దకు చేరింది.
“నిఫ్టీ 50 మరో ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగింది. రోజువారీ చార్టులో నిఫ్టీ అప్పర్ బొలింజర్ బ్యాండ్వైపు కదులుతోంది. దీనికి తోడు సూచీ కీలకమైన మూవింగ్ యావరేజ్ కంటే పైన కొనసాగుతోంది. 24,650 పైన ఉన్నంత కాలం సెంటిమెంట్ బుల్స్ వైపు మొగ్గు చూపవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1371.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2971.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 32530.28 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 44184.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాటగా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Movie tickets in Zomato : ఇక జొమాటోలో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు! పేటీఎంతో భారీ డీల్ ఫిక్స్..
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.43శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.89శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ మాత్రం 1.67శాతం పడింది.
స్టాక్స్ టు బై..
టాటా కెమికల్స్ లిమిటెడ్ (టాటాచెమ్): రూ.1,085.45 వద్ద కొనండి. టార్గెట్ రూ.1,130 స్టాప్ లాస్ రూ.1,060
ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండోటెల్): రూ.644.60 వద్ద కొనండి. టార్గెట్ రూ.674. రూ.630 వద్ద స్టాప్ లాస్
గుప్త వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్ (ఎల్ఈటీవీయూ): రూ.510.90 వద్ద కొనండి. టార్గెట్ రూ.535. స్టాప్ లాస్ రూ.498.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మోర్పెన్ లేబొరేటరీస్: రూ.78.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.82.50, స్టాప్ లాస్ రూ.75.50
ఆర్బీఎల్ బ్యాంక్: రూ.1298 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1365, స్టాప్ లాస్ రూ.1250
కళ్యాణ్ జ్యువెల్లర్స్: రూ.602.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.630, స్టాప్ లాస్ రూ.577
సట్లెజ్ టెక్స్ టైల్స్: రూ.73.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.77.50, స్టాప్ లాస్ రూ.70.75
రాణే ఇంజిన్: రూ.569 వద్ద కొనండి, టార్గెట్ రూ.595, స్టాప్ లాస్ రూ.545