తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఎస్​బీఐ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఎస్​బీఐ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

20 December 2024, 8:10 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 964 పాయింట్లు పడి 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 247 పాయింట్లు కోల్పోయి 23,951 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 564 పాయింట్లు పడి 51,576 వద్దకు చేరింది.

“నిఫ్టీ50కి తదుపరి కీలక మద్దతు 200 రోజుల ఎక్స్​పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ) వద్ద ఉంది. ఇది 23,700 స్థాయి వద్ద ఉంది. దీని కంటే తక్కువకు ఇండెక్స్ పడితే, మరింత ప్రతికూలతకు దారితీస్తుంది,” అని అజిత్ మిశ్రా - ఎస్​వీపీ, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4224.92 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3943.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 523.4 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 15172.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.04శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.09శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.10శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కొఫోర్జ్​ లిమిటెడ్​- బై రూ. 9657, స్టాప్​ లాస్​ రూ. 9319, టార్గెట్​ రూ. 10333

బీఎస్​ఈ లిమిటెడ్​- బై రూ. 5791.45, స్టాప్​ లాస్​ రూ. 5589, టార్గెట్​ రూ. 6197

ఇమామీ లిమిటెడ్​- బై రూ. 600, స్టాప్​ లాస్​ రూ. 585, టార్గెట్​ రూ. 620

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 833, స్టాప్​ లాస్​ రూ. 820, టార్గెట్​ రూ. 855

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1288, స్టాప్​ లాస్​ రూ. 1265, టార్గెట్​ రూ. 1320

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కామత్ హోటల్స్: రూ.242.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.255, స్టాప్ లాస్ రూ.233;

మాల్కామ్ ఇండియా: రూ.1610.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1555;

పోకర్ణ: రూ.1266.85 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1350, స్టాప్ లాస్ రూ.1225;

జోటా హెల్త్ కేర్: రూ.805.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.860, స్టాప్ లాస్ రూ.775; 

శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో: రూ .837.90 వద్ద కొనండి, టార్గెట్ రూ .900, స్టాప్ లాస్ రూ .810.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం