Stocks to buy today : ట్రేడర్స అలర్ట్- ఈ 5 స్టాక్స్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
16 September 2024, 7:31 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు కోల్పోయి 82,891 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 32 పాయింట్లు పడి 25,356 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 166 పాయింట్లు పెరిగి 51,938 వద్దకు చేరింది.
నిఫ్టీ స్వల్పకాలిక ధోరణి సానుకూలంగానే కొనసాగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. 25,400 పైన స్థిరమైన కదలిక సమీపకాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌ని 25,800కి తీసుకెళ్లదని శెట్టి అన్నారు. ఈ రోజు నిఫ్టీకి సపోర్ట్ 25,200 వద్ద ఉందని వివరించారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2364.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2532.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 16,600.88 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,990.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Flexi cap Mutual funds : ఇన్వెస్టర్స్ ఫోకస్ అంతా ‘ఫ్లెక్సీ క్యాప్’పైనే- మీరూ ఇన్వెస్ట్ చేయాలా?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.72శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.54శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.65 శాతం లాభపడింది.
చైనా, సౌత్ కొరియా, ఇండోనేషియా మార్కెట్లకు నేడు సెలవు. జపాన్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్స్ టు బై..
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్:- బై రూ. 4389.6, స్టాప్ లాస్ రూ. 4222, టార్గెట్ రూ. 4646
సెంచురీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్:- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 2790, టార్గెట్ రూ. 3155
మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ఛ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 390, టార్గెట్ రూ. 425
శక్తి షుగర్:- బై రూ. సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 35, టార్గెట్ రూ. 42
అమీ ఆర్గానిక్స్:- బై రూ. 1510, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1560.