తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- నేడు ఈ 6 స్టాక్స్​లో ట్రేడింగ్​ ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- నేడు ఈ 6 స్టాక్స్​లో ట్రేడింగ్​ ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu

01 October 2024, 8:00 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1272 పాయింట్లు పడి 84,299 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 368 పాయింట్లు కోల్పోయి 25,811 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 856 పాయింట్లు పతనమై 52,978 వద్దకు చేరింది.

నిఫ్టీ 50 గ్యాప్ డౌన్ ఓపెనింగ్​తో రోజువారీ చార్ట్​లో లాంగ్ బేర్ క్యాండిల్​ని సృష్టించింది.

"సాంకేతికంగా, ఈ చార్ట్ నమూనా బేరిష్ రివర్సల్ క్యాండిల్ నమూనాను సూచిస్తుంది. ఈ మార్కెట్ చర్య నిఫ్టీ 50కి స్వల్పకాలిక టాప్ రివర్సల్ చర్యను సూచిస్తుంది. రాబోయే సెషన్లలో మరింత బలహీనతను అశించొచ్చు. రోజువారీ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ప్రకారం నిఫ్టీలో బుల్లిష్​నెస్​ చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుత బలహీనత కొత్త గరిష్ట స్థాయికి అనుగుణంగా ఉండవచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9791.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6645.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:- Moo Deng meme coin : కేవలం 17 రోజుల్లో.. రూ. 1లక్ష పెట్టుబడి = రూ. 100 కోట్లు! ఎలా సాధ్యమైంది?

సెప్టెంబర్​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 12611.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30857.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.33శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.13శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.39 పతనమైంది.

స్టాక్స్​ టు బై..

ఎన్టీపీసీ:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.430 | టార్గెట్ ధర: రూ.465

ఫెడరల్ బ్యాంక్:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.190 | టార్గెట్ ధర: రూ.210

జేఎస్​డబ్ల్యూ స్టీల్:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.1,005 | టార్గెట్ ధర: రూ.1,080

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్): బై రూ. 533, స్టాప్​ లాస్​ రూ. 520, టార్గెట్​ రూ. 550

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ): బై రూ. 179, స్టాప్ లాస్​ రూ.175, టార్గెట్ రూ. 184

త్రిభోవందాస్ భీమ్​జీ జవేరి (టీబీజెడ్): బై రూ. 282, రూ.272 స్టాప్ లాస్​, టార్గెట్​ రూ.303 టార్గెట్

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్