Gold vs Nifty : బంగారంలో ఇన్​వెస్ట్​ చేయకపోతే 'లాభం' లేదు! నిఫ్టీ కన్నా అధిక రిటర్నులు..-gold vs nifty see which investment performed well in 2024 first half ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Vs Nifty : బంగారంలో ఇన్​వెస్ట్​ చేయకపోతే 'లాభం' లేదు! నిఫ్టీ కన్నా అధిక రిటర్నులు..

Gold vs Nifty : బంగారంలో ఇన్​వెస్ట్​ చేయకపోతే 'లాభం' లేదు! నిఫ్టీ కన్నా అధిక రిటర్నులు..

Sharath Chitturi HT Telugu
Jul 05, 2024 12:05 PM IST

Gold vs Nifty 2024 : మీరు బంగారంలో ‘ఇన్​వెస్ట్​’ చేయకపోతే చాలా నష్టపోతారు! ఉదాహరణతో సహా ఈ విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి.

గోల్డ్​ వర్సెస్​ నిఫ్టీ!
గోల్డ్​ వర్సెస్​ నిఫ్టీ!

ఇన్​వెస్ట్​మెంట్​ అంటే ముందుగా గుర్తొచ్చేది స్టాక్​ మార్కెట్​! దీర్ఘకాలంలో స్టాక్​ మార్కెట్​ల నుంచి మంచి రిటర్నులు సంపాదించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు.  అయితే ఇటీవలి కాలంలో పసిడి కూడా స్టాక్​ మార్కెట్​లకు గట్టిపోటీనిస్తోంది. అంతేకాదు పలు సందర్భాల్లో మార్కెట్​లకు మించి రిటర్నులను జనరేట్​ చేస్తోంది. 2024 ప్రథమార్థంలో కూడా ఇదే జరిగింది! రాబడుల పరంగా చూస్తే, 2024 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నిఫ్టీని బంగారం అధిగమించింది. 2024లో జూన్​ వరకు నిఫ్టీ 50 10.5 శాతం రిటర్నులు ఇచ్చింది. కానీ బంగారం ఏకంగా 13.37 శాతం రాబడిని ఇచ్చింది. రూపాయి పరంగా చూస్తే, ఎంసీఎక్స్ గోల్డ్ కాంట్రాక్ట్ ఈ కాలంలో ప్రతి 10 గ్రాముల బంగారానికి సుమారు రూ .8,400 రాబడిని ఇచ్చింది. పలు నివేదికల ప్రకారం, జూలై గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.74,777కు చేరుకుంది. ఇప్పుడు రూ .71,800 కు దగ్గరగా ఉంది. నిఫ్టీ కూడా గత నెల రోజుల కాలంలో భారీగా పెరిగింది. అయినప్పటికీ గోల్డ్​ పరుగును అందుకోలేకపోయింది!

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

గోల్డ్​ వర్సెస్​ నిఫ్టీ..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, చైనా నుంచి పెరుగుతున్న డిమాండ్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారం ధరను పెంచాయి. గత ఐదేళ్ల (2019-2023)లో తొలి అర్ధభాగంలో బంగారం, నిఫ్టీల పనితీరును పోల్చి చూస్తే.. బంగారం నాలుగు సందర్భాల్లో సానుకూల రాబడులను ఇచ్చింది. 2020లో అత్యధికంగా 13.71 శాతం, 2022లో అత్యల్పంగా 0.59 శాతం రాబడిని ఆర్జించింది. అయితే 2021లో బంగారం 3.63 శాతం ప్రతికూల రాబడిని ఇచ్చింది.

మరవైపు నిఫ్టీ ఐదేళ్లలో మూడింటిలో సానుకూల రిటర్నులు ఇచ్చింది. 2019, 2021, 2023 ప్రథమార్థంలో పెరుగుదల కనిపించింది. 2022లో నిఫ్టీ ఐదేళ్లలో అత్యధికంగా 12 శాతానికి పైగా రాబడులు సాధించింది. కోవిడ్ -19 లాక్​డౌన్​ కారణంగా నిఫ్టీ 2020 లో 15%, 2022 ప్రథమార్ధంలో 9% క్షీణించింది.

రిద్దిసిద్ధి బులియన్ లిమిటెడ్ (ఆర్ఎస్బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, ఐబీజేఏ జాతీయ హెడ్ పృథ్వీరాజ్ కొఠారి మాట్లాడుతూ.. “ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య 18% ర్యాలీ తర్వాత బంగారం ప్రస్తుతం రూ .71,000-72,000 మధ్య బలపడుతోంది,” అని చెప్పారు.

అయితే గత నెల వరకు భారీగా పెరిగిన పసిడి ధరల్లో ఇప్పుడు కాస్త స్థిరత్వం కనిపిస్తోంది. ఫెడ్​ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతోంది. చైనా నుంచి డిమాండ్​ కూడా తగ్గుతోంది. బలహీనమైన ఫండమెంటల్స్, సాంకేతిక కారణాల వల్ల వచ్చే 1,2 నెలల్లో బంగారం రూ.70,000కు పడిపోతుందని కొఠారి అంచనా వేశారు. అయితే, 2024 చివరి త్రైమాసికంలో కొత్త రికార్డు గరిష్టాలను చేరుకోవచ్చని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రూ.75,000, రూ.77,000 లక్ష్యాన్ని చేరుకోవాలంటే రూ.70,000 దిగువకు కొనుగోళ్ల జోరు కనిపించొచ్చని రిద్దిసిద్ధి బులియన్ సూచించింది.

అందుకే కేవలం స్టాక్​ మార్కెట్​లోనే కాకుండా గోల్డ్​లో కూడా ఇన్​వెస్ట్​ చేయాలి. ఇలా చేస్తే పోర్ట్​ఫోలియో డైవర్సిఫై అవుతుంది. కానీ ఫిజికల్​ గోల్డ్​, బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి, దానిని ఇన్​వెస్ట్​మెంట్​ అనుకోవడం సరికాదు. గోల్డ్​ ఈటీఎఫ్​, సావరిన్​ గోల్డ్​ బాండ్​ వంటి వాటిల్లో పెట్టుబడులు చేస్తేనే దానిని ఇన్​వెస్ట్​మెంట్​ కింద పరిగణించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం