తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : ఐఆర్​సీటీసీ స్టాక్​కి టైమ్​ వచ్చింది- ఇప్పుడు కొంటే భారీ లాభాలు..

Stocks to buy : ఐఆర్​సీటీసీ స్టాక్​కి టైమ్​ వచ్చింది- ఇప్పుడు కొంటే భారీ లాభాలు..

Sharath Chitturi HT Telugu

08 July 2024, 8:50 IST

google News
    • Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 53 పాయింట్లు పడి 79,997 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 22 పాయింట్లు పెరిగి 24,324 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయి 52,660 వద్దకు చేరింది.

నిఫ్టీ ఔట్​లుక్​పై హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి మాట్లాడుతూ.. గతంలో జూన్ 24న ఇదే తరహా బిల్డ్​ జరగడంతో తర్వాతి వారంలో స్థిరమైన కదలిక వచ్చింది. ఇది సానుకూల సంకేతం. నిఫ్టీలో అంతర్లీన ధోరణి సానుకూలంగా కొనసాగుతోంది. వచ్చే కొన్ని సెషన్లలో 24,400 నుంచి 24,500 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉంది. నిఫ్టీకి తక్షణ మద్దతు 24,170 స్థాయిలో ఉంది," అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 124.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1651.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6874.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 385.29 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Stock Market : ఈ స్టాక్ ధర రూ.36.. త్వరలో రూ.100కు చేరుకోవచ్చు

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.17శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.54శాతం, నాస్​డాక్​ 0.9శాతం మేర పెరిగాయి.

స్టాక్స్​ టు బై..

జైడస్ వెల్​నెస్: రూ.2118.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.2222, స్టాప్ లాస్ రూ.2050.

వోల్టాంప్ ట్రాన్స్​ఫార్మర్స్​: రూ.13219.85 వద్ద కొనండి, టార్గెట్ రూ.13950, స్టాప్ లాస్ రూ.12780.

కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ.1580 నుంచి రూ.1592 వరకు కొనండి, టార్గెట్ రూ.1640, స్టాప్ లాస్ రూ.1555.

ఎక్సైడ్ ఇండస్ట్రీస్: రూ.568 వద్ద కొనండి, టార్గెట్ రూ.588, స్టాప్ లాస్ రూ.545

ఐఆర్​సీటీసీ: రూ.1020 నుంచి రూ.1030, టార్గెట్ రూ.1070, స్టాప్ లాస్ రూ.970.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం