తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Today: స్టాక్ మార్కెట్లో రక్తపాతం; ఎన్నికల ఫలితాల ప్రభావంతో మూడు గంటల్లో రూ. 26 లక్షల కోట్లు ఆవిరి

Stock market today: స్టాక్ మార్కెట్లో రక్తపాతం; ఎన్నికల ఫలితాల ప్రభావంతో మూడు గంటల్లో రూ. 26 లక్షల కోట్లు ఆవిరి

HT Telugu Desk HT Telugu

04 June 2024, 12:18 IST

google News
  • Stock market today: లోక్ సభ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తుండడంతతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి, 3 గంటల వ్యవధిలో ఇన్వెస్టర్లు రూ. 26 లక్షల కోట్లు నష్టపోయారు.

భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ (Pixabay)

భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Stock market today: జూన్ 4, మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్ లో భారీ అమ్మకాలు ఇన్వెస్టర్లకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. వారి సంపద సుమారు రూ .26 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం ఉదయం 11:05 గంటల సమయంలో దాదాపు రూ.426 లక్షల కోట్ల నుంచి రూ.400 లక్షల కోట్లకు పడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా వస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ (stock market) భారీగా పతనమైంది.

భారీ నష్టాలు

మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున నష్టపోగా, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5 శాతానికి పైగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 5 శాతం నష్టపోయాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రారంభ ధోరణులు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురి అయ్యారని తెలుస్తోంది. ‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో నిరాశాజనక ప్రారంభ ధోరణులే భారత స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. ఈ ధోరణి ఎగ్జిట్ పోల్ కు అనుగుణంగా లేదు. దీంతో మార్కెట్లో కొంత భయాందోళనలు నెలకొన్నాయి’’ అని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్ష్కర్ అన్నారు.

బీజేపీకి సొంతంగా ఫుల్ మెజారిటీ రాదు

‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందన్న మార్కెట్ అంచనా తలకిందులయ్యే పరిస్థితి నెలకొన్నది. దాంతో, మోడీ 3.0 పాలన మార్కెట్ ఆశించినంత సంస్కరణ దృక్పథంతో ఉండకపోవచ్చు. అది మరింత సంక్షేమ ఆధారితంగా మారే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ అన్నారు. అయితే, ఇంకా చాలా రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నందున, ఫలితాల ట్రెండ్స్ ఆధారంగా మార్కెట్ కొంత పుజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ, సెన్సెక్స్

ఉదయం 10:10 గంటల సమయంలో నిఫ్టీ 50 4.67 శాతం క్షీణించి 22,177 వద్ద, సెన్సెక్స్ 4.96 శాతం క్షీణించి 72,674 వద్ద ట్రేడవుతున్నాయి. ఆ సమయంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం ఎంసీఏపీ దాదాపు రూ.400 లక్షల కోట్లుగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ 50లు గణనీయమైన లాభాలను సాధించాయి.

తదుపరి వ్యాసం